• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • HYPER AADI MARRIAGE DATE FIXED AND BRIDE IS FROM THIS DISTRICT MK

Hyper Aadi Marriage: హైపర్ ఆది పెళ్లి డేట్ ఫిక్స్...అమ్మాయిది ఏ జిల్లా అంటే...

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi)

హైపర్ ఆది మాత్రం ముందు సుధీర్, యాంకర్ ప్రదీప్ పెళ్లి అయితేనే తాను కూడా పెళ్లి చేసుకుంటాను అని మొండి పట్టుదల పట్టాడు. అయితే తాజాగా హైపర్ ఆది పెళ్లి విషయంలో తన డెసిషన్ మార్చుకున్నాడనే తెలుస్తోంది.

  • Share this:
    జబర్దస్త్ లో జూనియర్ ఆర్టిస్టుగా ప్రారంభమై స్క్రిప్ట్ రైటర్ గానూ, టీమ్ లీడర్ స్థాయికి ఎదిగిన హైపర్ ఆది అంటే ఒక రేంజ్ ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి హైపర్ ఆది అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమాల్లో కూడా మంచి పాత్రలు వేస్తున్నాడు. ఇక ఢీ షో అయితే మరో ఎత్తు అనే చెప్పాలి. ఇప్పటికే ఈ షో ద్వారా యాంకర్ వర్షిణితో కలిసి లవర్ బాయ్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నాడు. మరోవైపు అటు పొలిటికల్ గా కూడా హైపర్ ఆది ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు. ఇలా అన్ని రకాలుగా ఫిక్స్ అయిన హైపర్ ఆది. తాజాగా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. కానీ హైపర్ ఆది మాత్రం ముందు సుధీర్, యాంకర్ ప్రదీప్ పెళ్లి అయితేనే తాను కూడా పెళ్లి చేసుకుంటాను అని మొండి పట్టుదల పట్టాడు. అయితే తాజాగా హైపర్ ఆది పెళ్లి విషయంలో తన డెసిషన్ మార్చుకున్నాడనే తెలుస్తోంది. తన ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని అయితే తన తల్లిదండ్రులు చూసిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తాను ఫిక్స్ అయ్యానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు హైపర్ ఆది తన పెళ్లి డేట్ కూడా చెప్పేసి అందరినీ సర్ ప్రైజ్ ఇచ్చేశాడు. తనకు నెక్ట్స్ ఇయర్ పెళ్లి అవుతుందని, తమ స్వంత జిల్లా ప్రకాశం కు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నట్లు హైపర్ ఆది క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
    Published by:Krishna Adithya
    First published: