Hyper Aadi: హైపర్ ఆది పెళ్లికి ముహూర్తం కుదిరిందా.. అమ్మాయి ఎవరంటే..

హైపర్ ఆది (File/Photo)

Hyper Aadi Marriage| తెలుగు టీవీ‌ ఛానెల్స్‌లో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ ప్రోగ్రామ్ చూసేవాళ్లకు హైపర్ ఆది గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా హైపర్ ఆది పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టు వాళ్ల కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

  • Share this:
    Hyper Aadi Marriage| తెలుగు టీవీ‌ ఛానెల్స్‌లో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ ప్రోగ్రామ్ చూసేవాళ్లకు హైపర్ ఆది గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.  జబర్ధస్త్ షోలో  కేవలం హైపర్ ఆది వేసే పంచ్‌ల గురించి ఈ షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వీలైనపుడల్లా.. మెగా హీరోలపై అభిమానం చూపిస్తూనే ఉంటాడు. జబర్ధస్త్ షోలో జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి స్క్రిప్ట్ రైటర్‌గా తన సత్తా చూపాడు. స్క్రిప్ట్ రైటర్ నుంచి టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. అంతేకాదు జబర్ధస్త్‌లో ఎంతో మంది కమెడియన్స్ ఉన్న తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. జబర్ధస్త్‌లో హైపర్ ఆది వేసే పంచ్‌లకు సామాన్య ప్రేక్షకులే కాదు.. సినిమా సెలబ్రిటీలు కూడా ఆయనకు అభిమానులుగా మారారు. సినిమాల్లో కూడా వరుసగా కమెడియన్‌ వేషాలు వేస్తున్నాడు. కానీ ఎందుకనో సినిమాల్లో హైపర్ ఆది పంచ్‌లు అంతగా పేలడం లేదు.

    ఆ సంగతి పక్కన పెడితె.. హైపర్ ఆది త్వరగా పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిలవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు సమాచారం. కానీ హైపర్ ఆది మాత్రం.. తన తోటి యాంకర్స్ సుధీర్, ప్రదీప్ పెళ్లి తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని ఘంటాపథంగా చెబుతున్నాడు. రీసెంట్‌గా హైపర్ ఆది తన పెళ్లి విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

    hyper aadi marriage
    హైపర్ ఆది మ్యారేజ్ (File/Phto)


    ఇప్పటికే ఢీ యాంకర్ వర్షిణితో హైపర్ ఆది ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హైపర్ ఆదికి ఇంట్లో వాళ్లు సంబంధాలు చూసారట. అంతేకాదు అమ్మాయికి కూడా ఫిక్స్ అయిందట. వాళ్ల చుట్టాలమ్మాయినే హైపర్ ఆది పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే మాటా మంతీ కూడా అయ్యాయి. ప్రస్తుతం మంచి ముహూర్తాలు లేనందున.. మేలో లోని నిశ్చయ తాంబూలాలు చేసుకొని అదే నెలలో హైపర్ ఆది పెళ్లి చేసేలా కుటుంబ సభ్యులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. మొత్తంగా హైపర్ ఆది పెళ్లి డేట్ పై కుటుంబ సభ్యులు అఫీషియల్‌గా ప్రకటించడమే తరువాయి అంటున్నారు. మొత్తంగా జబర్థస్త్ కమెడియన్స్‌లలో హైపర్ ఆది త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నడటన్న మాట.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: