హైపర్ ఆదిపై దేశభక్తుల ఫైర్...ఇంకో సారి అలా చేయవద్దని స్ట్రాంగ్ వార్నింగ్..

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి జీవం పోశాడని పలు ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ స్వాతంత్ర్య పోరాట యోధుడిని నవ్వులాటగా చూపిస్తూ జబర్దస్త్ లాంటి స్కిట్లు రూపొందించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

news18-telugu
Updated: October 20, 2019, 8:11 PM IST
హైపర్ ఆదిపై దేశభక్తుల ఫైర్...ఇంకో సారి అలా చేయవద్దని స్ట్రాంగ్ వార్నింగ్..
హైపర్ ఆది ఫేస్ బుక్ ఫోటో (Source: Facebook)
news18-telugu
Updated: October 20, 2019, 8:11 PM IST
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్కిట్స్ అంటే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. సందర్భానికి తగ్గట్టుగా గెటప్స్ వేస్తూ నవ్వులు పూయించడం హైపర్ ఆదికి వెన్నతో పెట్టిన విద్య అయితే తాజాగా హైపర్ ఆది వేసిన ఓ గెటప్ వివాదంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సైరా నరసింహా రెడ్డి గెటప్ ను జబర్దస్త్ స్కిట్ లో వేసి ఆది వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. తన 151వ చిత్రంగానూ, అలాగే చరిత్రలో నిలిచిపోయే కేరక్టర్ పోషించిన చిరంజీవికి సైరా నరసింహారెడ్డి ఒక మైలురాయి అనే చెప్పవచ్చు. అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి జీవం పోశాడని పలు ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ స్వాతంత్ర్య పోరాట యోధుడిని నవ్వులాటగా చూపిస్తూ జబర్దస్త్ లాంటి స్కిట్లు రూపొందించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

గతంలో బాలకృష్ణపై కూడా హైపర్ ఆది కామెడీ స్కిట్స్ రూపొందించడంపై ఆయన అభిమానులు ఫైర్ అయ్యారు. అయితే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుల చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసే చిత్రాలను ఇలా అవహేళన చేయడం తగదని పలువురు జాతీయవాదులు ఫైర్ అవుతున్నారు.

First published: October 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...