హైపర్ ఆదికి ఫ్రస్ట్రేషన్...ఢీలో సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్‌ ధాటికి తట్టుకోలేక...

హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్ (Image: Youtube)

యాంకర్ వర్షిణితో కంఫర్ట్ గా ఫీల్ కాలేదని టాక్ వినిపిస్తోంది. మరోవైపు హైపర్ ఆదికి పెద్దగా డాన్స్ తో పరిచయం లేకపోవడం. అలాగే తనకు జోడీగా ఉన్న వర్షిణి కూడా పెద్దగా యాక్టివ్ కాకపోవడంతో ఆదికి ఫ్రస్ట్రేషన్ వస్తోందని టాక్ వినిపిస్తోంది.

  • Share this:
    హైపర్ ఆదికి ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు వెళ్లిపోయింది. ఢీ ప్రోగ్రాంలో తాను అడుగుపెట్టినప్పటి వేళ విశేషం బాగోలేదో ఎంటో, కానీ అనుకున్న హైప్ ను హైపర్ ఆది అందుకోలేకపోయాడనే చెప్పాలి. నిజానికి ఢీ ప్రోగ్రాం అనగానే అందరికీ గుర్తొచ్చేది. సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య కెమిస్ట్రీ వల్లనే వర్కౌట్ అవుతోందని చాలా మంది అంటుంటారు. అలాంటిది ఈ షోలో యాంకర్ ప్రదీప్ ఎలాగో అలా సెటిల్ అయ్యాడు. ఆ మధ్య ప్రదీప్ సడెన్ గా మాయం అయినప్పటికీ, ఆ ప్లేస్ లో యాంకర్ రవి వచ్చి అలరించే ప్రయత్నం చేశాడు. అతడితో పాటు యాంకర్ వర్షిణి కూడా వచ్చి సెటిల్ అయ్యింది. అయితే యాంకర్ రవి కూడా ఎగ్జిట్ అయిపోవడంతో మరోసారి యాంకర్ ప్రదీప్ రీఎంట్రీ ఇచ్చాడు. కాగా మల్లెమాల టీమ్ సడెన్ సర్ ప్రైజ్ గా హైపర్ ఆదిని మరో యాంకర్ గా ప్రవేశ పెట్టింది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ టీవీల్లో ప్రసారం అయ్యింది. అయితే స్వతహాగా జబర్దస్త్ లో తన స్కిట్స్ లో పంచులతో హడలెత్తించే హైపర్ ఆది. ఢీ షోలో మాత్రం కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది.

    అంతేకాదు యాంకర్ వర్షిణితో కంఫర్ట్ గా ఫీల్ కాలేదని టాక్ వినిపిస్తోంది. మరోవైపు హైపర్ ఆదికి పెద్దగా డాన్స్ తో పరిచయం లేకపోవడం. అలాగే తనకు జోడీగా ఉన్న వర్షిణి కూడా పెద్దగా యాక్టివ్ కాకపోవడంతో ఆదికి ఫ్రస్ట్రేషన్ వస్తోందని టాక్ వినిపిస్తోంది.
    Published by:Krishna Adithya
    First published: