స్వతహాగా జబర్దస్త్ లో తన స్కిట్స్ లో పంచులతో హడలెత్తించే హైపర్ ఆది. ఢీ షోలో మాత్రం కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు యాంకర్ వర్షిణితో కంఫర్ట్ గా ఫీల్ కాలేదని అందుకే తొలి ఎపిసోడ్ లో హైపర్ ఆది పెద్దగా తన పంచులతో విరుచుకుపడే చాన్స్ దొరకలేదనే అంటున్నారు.
ఢీ ప్రోగ్రాం అనగానే అందరికీ గుర్తొచ్చేది...సుడిగాలి సుధీర్, రష్మీల కెమిస్ట్రీనే అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. అలాంటిది ఈ షోలో యాంకర్ ప్రదీప్ ఎలాగో అలా సెటిల్ అయ్యాడు. ఆ మధ్య ప్రదీప్ సడెన్ గా మాయం అయినప్పటికీ, ఆ ప్లేస్ లో యాంకర్ రవి వచ్చి అలరించే ప్రయత్నం చేశాడు. అతడితో పాటు యాంకర్ వర్షిణి కూడా వచ్చి సెటిల్ అయ్యింది. అయితే యాంకర్ రవి కూడా ఎగ్జిట్ అయిపోవడంతో మరోసారి యాంకర్ ప్రదీప్ రీఎంట్రీ ఇచ్చాడు. కాగా మల్లెమాల టీమ్ సడెన్ సర్ ప్రైజ్ గా హైపర్ ఆదిని మరో యాంకర్ గా ప్రవేశ పెట్టింది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ టీవీల్లో ప్రసారం అయ్యింది. అయితే స్వతహాగా జబర్దస్త్ లో తన స్కిట్స్ లో పంచులతో హడలెత్తించే హైపర్ ఆది. ఢీ షోలో మాత్రం కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు యాంకర్ వర్షిణితో కంఫర్ట్ గా ఫీల్ కాలేదని అందుకే తొలి ఎపిసోడ్ లో హైపర్ ఆది పెద్దగా తన పంచులతో విరుచుకుపడే చాన్స్ దొరకలేదనే అంటున్నారు. అయితే అటు సుడిగాలి సుధీర్ మాత్రం ఎప్పటిలాగా తన ఎనర్జీతో రెచ్చిపోతున్నట్లు టాక్.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.