హైపర్ ఆది బంపర్ ఆఫర్ కొట్టేశాడు. మల్లెమాల ప్రొడక్షన్ న్యూ ఇయర్ కోసం ప్లాన్ చేస్తున్న ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో హైపర్ ఆదితో పాటు యాంకర్ వర్షిణి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొత్తం ప్రోగ్రాంలో లేడీస్ మాత్రమే ఉండేలా ప్లాన్ చేశారు. ఇందులో అటు రోజాతో పాటు సీనియర్ ఆర్టిస్టులు అన్నపూర్ణమ్మ, వై.విజయ, యాంకర్లు విష్ణు ప్రియ, కరాటే కళ్యాణి ఇలా లేడీస్ అంతా కలిసి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ షోలో యాంకర్ వర్షిణి రెచ్చిపోయిందనే చెప్పవచ్చు. మొన్నే పటాస్ షోలో ఆడియన్స్ లో ఓ అబ్బాయి బుగ్గకొరికిన వర్షిణి, తాజాగా హైపర్ ఆదిని అమాంతం తన బిగికౌగిలిలో బంధించి. ఏకంగా పైకి ఎత్తుకొని తన సత్తా చాటింది. మరోవైపు హైపర్ ఆది సైతం కొంటెగా సైగలు చేస్తూ వర్షిణి చేసిన పనిని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది. అంతేకాదు ఇంకోసారి ఎత్తుకుంటే ఇంకా బాగుంటుంది అంటూ సెటైర్ వేయడం చర్చగా మిగిలింది.
Aadavari Partylaki Arthale Verule Promo - 2020 New Year Special Event.Telecast on 31st December 2019 at 09:30 PM in Etv Telugu#Varshini #SudigaliSudheer #HyperAadhi #Bhanusree #VishnuPriya #AutoRamPrasad #GetupSrinu #YashMaster #RojaSelvamani #Jafarhttps://t.co/N7MV5cvOAC
— Mallemalatv (@mallemalatv) December 14, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.