ఇష్టమైన సెలబ్రిటీని అభిమానులు పలురకాలు ప్రశ్నలు వేశారు అభిమానులు. ఈ సందర్భంగా హైపర్ ఆదిని ... ఓ అభిమాని అడిగే ప్రశ్న అక్కడున్న వారందరు షాక్ అయ్యేలా చేసింది. సాధారణంగా ఇండస్ట్రీలో ఎదుగుదల కోసం అందరు హీరోలను ఇష్టపడుతుంటారు. కానీ మీరు మాత్రం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఇష్పపడుతున్నారు. దీని వల్ల మీకు సినిమా అవకాశాలు తగ్గుతున్నాయా? అంటూ ప్రశ్నించారు. దీనికి ఆది సమాధానం ఇచ్చాడు.
అలాంటిదేమి లేదన్నాడు హైపర్ ఆది. సినిమా అవకాశాలు తగ్గుతున్నాయన్నది కాదన్నారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే పర్సనల్‌గా చాలా ఇష్టమన్నారు. దాని వల్ల సినిమా అవకాశాలు తగ్గడం అనేది జరగలేదన్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామందికి పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టమన్నాడు ఆది. తనకు పవన్ కళ్యాణ్ గారంటే సినిమాల పరంగా కంటే వ్యక్తిత్వం పరంగా చాలా ఇష్టమన్నాడు. ఈరోజుల్లో కరెక్ట్‌గా మనిషికి సాయం చేసేవాడిని దేవుడు అంటాం. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు దేవుడులాంటి వారన్నారు. అలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ ప్రథముడు అన్నాడు ఆది. సాయం చేయడంలో ఎంత ముందు ఉంటాడంటే.. అతని దగ్గర డబ్బులు లేకపోయినా.. అప్పు చేసి మరీ సాయం చేసే మనస్తత్వం కలిగిన ఏకైక స్టార్ పవర్ స్టార్ అంటూ తన అభిమాన హీరో గురించి చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.
ఇక హైపర్ ఆదికి కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అందుకే అప్పుడప్పుడు తన స్కిట్స్‌లో పొలిటికల్ పంచ్‌లు కూడా వేస్తుంటాడు. బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షోకు (Jabardasth show) ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కుతోంది. ఇక జబర్దస్త్ షోకు హైపర్ ఆది (Jabardasth Hyper Aadi) స్కిట్లు హైలెట్ గా నిలుస్తుంటే ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు సుడిగాలి సుధీర్ స్కిట్లు హైలెట్ గా నిలుస్తున్నాయి. వీళ్ల స్కిట్ల వల్లే ఈ కామెడీ షోలకు అంచనాలకు మించి రేటింగ్స్ వస్తున్నాయి. అయితే గత కొంతకాలంగా ఆది (Jabardasth fame Hyper Aadi) జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. యూట్యూబ్ లో జబర్దస్త్ ప్రోమో విడుదలైన సమయంలో ఆదిని మిస్ అవుతున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆది ప్రస్తుతం ఈ షోకు దూరంగా ఉండటానికి రెమ్యునరేషన్ కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఢీ డ్యాన్స్ షోలో కనిపిస్తున్న హైపర్ ఆది జబర్దస్త్ లో కనిపించకపోవడంతో ఇది నిజం కావచ్చని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆది అభిమానులు మాత్రం ఆది త్వరలోనే జబర్దస్త్ షోలో రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఒకవేళ ఆది జబర్దస్త్ కు దూరమైతే అందుకు గల కారణాలను అయినా వెల్లడించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.