నా జీవితంలో అనసూయకు ప్రత్యేక స్థానం ఉంది.. హైపర్ ఆది..

జబర్దస్త్ కామెడీ షోలో చాలా మంది ఉంటారు కానీ హైపర్ ఆది, అనసూయ మధ్య ఉండే కెమిస్ట్రీ మాత్రం చాలా స్పెషల్. నిజానికి వాళ్లిద్దరి మధ్య ఆకాశం, నేలకు ఉన్నంత తేడా ఉంటుంది. తాజాగా ఆయన అనసూయకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.

news18-telugu
Updated: April 28, 2020, 5:44 PM IST
నా జీవితంలో అనసూయకు ప్రత్యేక స్థానం ఉంది.. హైపర్ ఆది..
అనసూయ, హైపర్ ఆది
  • Share this:
జబర్దస్త్ కామెడీ షోలో చాలా మంది ఉంటారు కానీ హైపర్ ఆది, అనసూయ మధ్య ఉండే కెమిస్ట్రీ మాత్రం చాలా స్పెషల్. నిజానికి వాళ్లిద్దరి మధ్య ఆకాశం, నేలకు ఉన్నంత తేడా ఉంటుంది. తాజాగా ఆయన అనసూయకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. వివరాల్లోకి వెళితే.  జబర్దస్త్ జోడీల్లో అనసూయ, హైపర్ ఆదిలకు ప్రత్యేక స్థానం ఉంది. యాంకర్ స్థానంలో అనసూయ కూర్చుందంటే చాలు.. ఇక హైపర్ ఆది ఆమెపై పంచుల మీద పంచులేస్తుంటాడు. అలాగే అనసూయ అందాన్ని తెగ పొగిడేస్తూ రక్తి కట్టిస్తుంటాడు. తాజాగా ఈ ఆ పంచ్ లలో రొమాంటిక్ డోస్ పెరిగుతూ వస్తోంది. ఆ మధ్య  ఆదిని అనసూయ బావా అంటూ వయ్యారంగా పిలవడం ఇంకా జబర్దస్త్ ప్రేక్షకుల మదిని దాటి పోలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హైపర్ ఆది మాట్లాడుతూ.. తన జీవితంలో అనసూయకు ప్రత్యేక స్థానం ఉంది. ఆమెతో స్కిట్స్ విషయంలో కొంచెం రొమాంటిక్ టచ్ ఇచ్చినా.. నిజ జీవితంలో మాత్రం ఆమె అంటే ఎంతో రెస్పెక్ట్ ఉంది. ఒక నిబద్ధత గల యాంకర్‌గా మా కమెడియన్స్‌కు ఆమె ఎనర్జీ మాకు బలం అన్నారు. తన జీవితంలో జబర్దస్త్ ఓ భాగం. అందువల్లే నేనీ స్థానంలో ఉన్నాను. ఆ జబర్ధస్త్ షోతోనే అనసూయ కూడా పాపులర్ అయింది. అమె వల్ల ఈ షోకు కొంచెం గ్లామర్ టచ్ వచ్చింది అది వేరే విషయం అనుకో. కానీ నేను వేసే సెటెర్లను ఆమె స్పోర్టివ్‌గా తీసుకుంటోంది. అందుకే ఆమె అంటే తనకు ఎంతో ప్రత్యేకమన్నారు.
First published: April 28, 2020, 5:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading