Hyper aadi: హైపర్ ఆది తొడపై ప్రియమణి...ఆ టచ్‌కు బాబు తట్టుకోలేక...ఏం చేశాడంటే...

ప్రతీకాత్మకచిత్రం

హైపర్ ఆదికి దిక్కు లేకుండా పోయింది. దీంతో ఏకంగా జడ్జ్ ప్రియమణితోనే పులిహార కలిపేందుకు సిద్ధమై పోయాడు. ఇప్పటికే యాంకర్ ప్రదీప్ ఒక జడ్జ్ పూర్ణ పై కర్చీఫ్ వేసేయగా, ఇఫ్పుడు హైపర్ ఆదికి ప్రియమణి తప్ప మరో దిక్కు లేకుండా పోయింది.

  • Share this:
    హైపర్ ఆది ఈ మధ్య కాస్త డౌన్ అయ్యాడనే చాలా మంది ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ లో రొటీన్ కామెడీకి అలవాటు పడిపోయిన హైపర్ ఆది బయట వస్తున్న షోస్ లో అంతగా డామినేట్ చేయలేకపోతున్నాడు. అంతేకాదు ఢీ షోలో గుడ్డిలో మెల్లలా ఒక సీజన్ మొత్తం లాక్కొచ్చిన హైపర్ ఆది ఇప్పుడు వర్షిణి లేకపోవడంతో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. దీంతో తన ప్రెజెన్స్ షోలో వ్యక్త పరిచేందుకు ఎవరితో పులిహార కలిపితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే జబర్దస్త్ లో అనసూయతో హైపర్ ఆది పులిహార కలిపేవాడు. ఇద్దరూ కలిసి షోలో డాన్సులు చేశారు. అంతేకాదు కాస్త ఘాటైన సెటైర్లు వేసినా అనసూయ పెద్దగా పట్టించుకునేది కాదు. అయితే రాను రాను వారిద్దరి కెమిస్ట్రీ పెద్దగా బోర్ కొట్టేసింది. ఎందుకంటే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కౌట్ కాదు అనేది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ హైపర్ ఆది రాక్షస ప్రయత్నం చేసి లాక్కొచ్చాడు. ఎందుకంటే సుధీర్, రష్మీ జంట చూడ ముచ్చటగా ఉండేది. వారి ముందు హైపర్ ఆది, అనసూయ కెమిస్ట్రీని ఊహించుకునేందుకు కూడా భయంకరంగా ఉండేది. అయితే కామెడీ కోసం కాస్త వర్కౌట్ అయ్యింది. అయితే హైపర్ ఆది మాత్రం ఢీ షోలో కాస్త అదృష్టం తగిలిందనే చెప్పాలి. వర్షిణి రూపంలో యాంకర్ దొరకడం ఆమెతో కాస్త కెమిస్ట్రీ కుదరడంతో ఒక సీజన్ అంతా గడిపేశాడు. ఒక దశలో వర్షిణి పేరు ఎత్తగానే హైపర్ ఆది సిగ్గుల మొలక అయ్యేవాడు.

    అయితే హైపర్ ఆది విషయంలో వర్షిణి కాస్త లైట్ తీసుకుందనే చెప్పాలి. హైపర్ ఆదిని వాడుకొని వదిలేసిందనే టాక్ కూడా వినిపించింది. ప్రస్తుతం వర్షిణి ఢీ షో నుంచి తప్పుకుంది. దీంతో ఇక హైపర్ ఆదికి దిక్కు లేకుండా పోయింది. దీంతో ఏకంగా జడ్జ్ ప్రియమణితోనే పులిహార కలిపేందుకు సిద్ధమై పోయాడు. ఇప్పటికే యాంకర్ ప్రదీప్ ఒక జడ్జ్ పూర్ణ పై కర్చీఫ్ వేసేయగా, ఇఫ్పుడు హైపర్ ఆదికి ప్రియమణి తప్ప మరో దిక్కు లేకుండా పోయింది. ఇక చేసేదేమి లేక హైపర్ ఆది ప్రియమణినే నమ్ముకున్నాడు.

    తాజాగా హైపర్ ఆది కాస్త ఎమోషనల్ అయి డీ జోడీ కమింగ్ ఎపిసోడ్ లో ప్రియమణి కోసం ప్రత్యేకంగా డాన్స్ చేసి తన తొడపై కూర్చోమని ఆహ్వానించాడు. అంతుకు ప్రియమణి అంగీకరించింది. అంతేకాదు హైపర్ ఆది తొడపై ప్రియమణి కూర్చుంది. దీంతో హైపర్ ఆది గుండెల్లో గంట మోగిందనే చెప్పాలి. జాతీయ ఉత్తమనటి, అలాగే కోట్లాది మంది కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్న హీరోయిన తన తొడపై కూర్చోగానే చాలురా దేవుడా ఈ బతుకు అనిపించిందని, హైపర్ ఆది తన సన్నిహితులకు చెప్పుకొచ్చాడు. అంతేకాదు. హైపర్ ఆది తాజాగా డాన్సులను మెరుగు పరుచుకునేందుకు బరువు తగ్గే పనిలో కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరి సుడిగాలి సుధీర్ తో పోటీ పడాలంటే ఆమాత్రం చేయాల్సిందే కదా.
    Published by:Krishna Adithya
    First published: