హైపర్ ఆది చేసిన ఆ పనికి షాక్‌లో దొరబాబు...కన్నీళ్లు పెట్టుకొని దారుణం...

హైపర్ ఆది చేసిన ఆ పనికి షాక్‌లో దొరబాబు...కన్నీళ్లు పెట్టుకొని దారుణం...

దొరబాబు, హైపర్ ఆది (Hyper Aadi Dorababu)

దొరబాబు గతంలో చేసిన పనుల వల్ల ఆదికి తలవొంపులు వచ్చినప్పటికీ, అవేమీ మనస్సులో పెట్టుకోకుండా, హైపర్ ఆది చేసిన సహాయానికి అతడు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

 • Share this:
  సెక్స్ రాకెట్ లో జబర్దస్త్ కమెడియన్ దొరబాబు పట్టుబడటంతో అప్పట్లో హైపర్ ఆది టీమ్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అయితే ఈ ఘటనతో దొరబాబు కెరీర్ డేంజర్ జోన్ లో పడిందని అంతా అనుకున్నారు. అయితే హైపర్ ఆది టీమ్ కు మల్లెమాల ప్రొడక్షన్ ఏమైనా హెచ్చరికలు జారీ చేసి సరిపుచ్చింది. తర్వాత ఎపిసోడ్స్ లో దొరబాబు ప్రత్యక్షమయ్యాడు. మళ్లీ కంటిన్యూ అవుతున్నాడు. సినిమాల్లో కూడా చాన్సులు దక్కించుకుంటున్నాడు. అయితే గతేడాది లాక్ డౌన్ కారణంగా జబర్దస్త్ షూటింగ్స్ నిలిచిపోయాయి. ఆది స్కిట్ లో ప్రధానంగా కనిపించే దొరబాబు, రైజింగ్ రాజులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే వీరి పరిస్థితిని గమనించిన హైపర్ ఆది తన టీమ్ మేట్స్ అందరికీ సహాయం చేసినట్లు సమాచారం.

  తాజాగా ఏర్పడిన రెండో లాక్ డౌన్ సమయంలోనూ టీమ్ మేట్స్ ఇబ్బందులు పడకుండా హైపర్ ఆది, అందరికీ ముందస్తు పేమెంట్స్ చేసేశాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఆరోగ్య సమస్యలు సైతం చుట్టుముట్టే ప్రమాదం ఉంది. దీంతో తన టీమ్ మేట్స్ ఎవరికికష్టం వచ్చినా హైపర్ ఆది ఇలాగే రియాక్ట్ అవుతాడని అందుకే అతడికి మంచి పేరు ఉందని టీమ్ మేట్స్ చెబుతుంటారు.

  అంతేకాదు దొరబాబు గతంలో చేసిన పనుల వల్ల ఆదికి తలవొంపులు వచ్చినప్పటికీ, అవేమీ మనస్సులో పెట్టుకోకుండా, హైపర్ ఆది చేసిన సహాయానికి అతడు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దొరబాబు లాంటి ఆర్టిస్టుకి లైఫ్ ఇవ్వడమే కాదు. అతడు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయినా, ఆది క్షమించి వదిలేయడమే కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. దీంతో నెటిజన్లు ఆది చేసిన పనికి శభాష్ అంటున్నారు.
  Published by:Krishna Adithya
  First published:

  అగ్ర కథనాలు