హైపర్ ఆదిని దారుణంగా మోసం చేసిన యాంకర్...ఎవరూ ఊహించని ట్విస్ట్...

హైపర్ ఆది వర్షిణి మధ్య రొమాన్స్ (hyper aadi varshini)

అనసూయ, రష్మీలతో పోల్చితే వర్షిణి పెద్ద యాక్టివ్ కాదు. అయినా హైపర్ ఆది పక్కన వర్షిణి కాస్త అట్రాక్షన్ గా నిలిచింది. సుధీర్ రష్మీ తరహాలోనే వర్షిణి, హైపర్ ఆది జోడి కూడా బాగానే కుదిరింది.

  • Share this:
    హైపర్ ఆది జబర్దస్త్ లో చాలా కింది స్థాయి నుంచి వచ్చిన ఆర్టిస్ట్, జబర్దస్త్ లో రైటర్ గానూ, ఆర్టిస్ట్ గా రాణిస్తూ, పై స్థాయి అందుకున్నాడు. అంతేకాదు టీమ్ లీడర్ గా కూడా ఎదిగాడు. అయితే ఈ క్రమంలోనే సినిమాల్లోనూ ఆది రాణించాడు. అయితే సుడిగాలి సుధీర్ కు పోటీగా ఎదిగిన హైపర్ ఆది ఢీ ప్రోగ్రాంలో కూడా యాంకర్ అయ్యే స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో హైపర్ ఆదికి జోడీగా వర్షిణి పరిచయం అయ్యింది. స్వతహాగానే ఆడవాళ్లు అంటే కాస్త బిడియపడే హైపర్ ఆదికి వర్షిణి చాలా హెల్ప్ చేసింది. ఇద్దరూ కలిసి డ్యూయెట్స్ సైతం పాడారు. నిజానికి అనసూయ, రష్మీలతో పోల్చితే వర్షిణి పెద్ద యాక్టివ్ కాదు. అయినా హైపర్ ఆది పక్కన వర్షిణి కాస్త అట్రాక్షన్ గా నిలిచింది. సుధీర్ రష్మీ తరహాలోనే వర్షిణి, హైపర్ ఆది జోడి కూడా బాగానే కుదిరింది. అయితే హైపర్ ఆది కూడా లవర్ బాయ్ గా ఎదిగే ప్రయత్నం చేశాడు. అందులో కాస్త సక్సెస్ కూడా అయ్యాడు. అయితే ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న ఈ జోడీకి కొత్త కష్టం వచ్చిపడింది. ఢీ జోడీ సీజన్ పూర్తి కావడంతో పాటు, కరోనా లాక్ డౌన్ కారణంగా కొత్త ఎపిసోడ్స్ కూడా ఆగిపోయాయి. అయితే కొత్త సీజన్ స్టార్ట్ అయ్యేందుకు చాలా టైం పట్టేలా ఉంది. అయితే ఈ క్రమంలోనే హైపర్ ఆదితో మళ్లీ జోడి కట్టేందుకు వర్షిణి చాలా కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొత్త గా వెబ్ సిరీస్ లలో కూడా వర్షిణి నటిస్తూ బిజీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న హైపర్ ఆదికి వర్షిణి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. వర్షణి నో చెబితే హైపర్ ఆది పక్కన మరో యాంకర్ సెట్ అయ్యేందుకు చాలా టైం పట్టే అవకాశం ఉంది.
    Published by:Krishna Adithya
    First published: