దొరబాబు సెక్స్ రాకెట్ విషయంలో హైపర్ ఆదికి కొత్త తలనొప్పులు...

దొరబాబు, హైపర్ ఆది (Hyper Aadi Dorababu)

కెరీర్ స్టార్టింగులో ఆ టైపు వీడియోల్లో నటించడంతో అమ్మాయిల పిచ్చి ఉన్న వాడిగా దొరబాబుపై జడ్జిలతో సహా పార్టిసిపెంట్స్ అందరూ సెటైర్లు వేసేవారు. అయితే వ్యభిచార గృహంలో దొరబాబు, పరదేశి పట్టుబడడంతో జబర్దస్త్ టీమ్‌ షాక్‌కు గురైంది.

  • Share this:
    దొరబాబు సెక్స్ రాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయమే అయితే ఈ అంశంలో హైపర్ ఆదికి కొత్త తలనొప్పులు తప్పేలా లేవు. వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడుల్లో జబర్దస్త్‌ కామెడీ షో నటులు దొరబాబు, పరదేశి పట్టుబడిన విషయం తెలిసిందే..వైజాగ్ లోని మాధవ దారలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందడంతో, టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో దాడులు జరపగా ఈ దాడిలో ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులతో సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిలో జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశి ఉండడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వీరిద్దరు హైపర్ ఆది టీమ్‌లో స్కిట్స్ చేయడంతో పాపులర్ అయ్యారు.

    కెరీర్ స్టార్టింగులో ఆ టైపు వీడియోల్లో నటించడంతో అమ్మాయిల పిచ్చి ఉన్న వాడిగా దొరబాబుపై జడ్జిలతో సహా పార్టిసిపెంట్స్ అందరూ సెటైర్లు వేసేవారు. అయితే వ్యభిచార గృహంలో దొరబాబు, పరదేశి పట్టుబడడంతో జబర్దస్త్ టీమ్‌ షాక్‌కు గురైంది. నిజానికి హైపర్ ఆదికి మొదటి నుంచి దొరబాబు సంగతి పూర్తిగా తెలిసినవాడే. అతడి దురలవాట్ల గురించి కూడా హైపర్ ఆదికి తెలిసే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే హైపర్ ఆది అతడిపై సెటైర్లు వేసేవాడు. కానీ దొరబాబు నిజజీవితంలో కూడా అలాంటి వాడే అని తేలింది. అయితే ఈ వ్యవహారం తర్వాత కూడా దొరబాబు జబర్దస్త్ లో కొనసాగాడు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ ఎఫెక్ట్ తో జబర్దస్త్ షూటింగులు ఆగిపోయాయి. దీంతో మళ్లీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అనే దానిపై క్లారిటీ లేదు. అయితే హైపర్ ఆదికి మాత్రం ప్రొడక్షన్ టీమ్ నుంచి ఒత్తిడి స్టార్ట్ అయినట్లు సమాచారం అందుతోంది. లాక్ డౌన్ కారణంగా అడ్వర్టయిజ్ మెంట్స్ ఆదాయం తగ్గే అవకాశం ఉందని, అందుకే కొంత కాలం పాటు కొద్ది మంది ఆర్టిస్టులతోనే జబర్దస్త్ నడిపించాలని టీమ్ లీడర్లకు చెప్పినట్లు సమాచారం సన్నిహిత వర్గాల ద్వారా అందుతోంది. అయితే హైపర్ ఆది టీమ్ లో దొరబాబును ఉంచాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా అతడికి తెలిపారు. దీంతో హైపర్ ఆది ఎలాంటి డిసెషన్ తీస్కుంటాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు.
    Published by:Krishna Adithya
    First published: