HYPER AADI GETS TROLLED BY NETIZENS IN DHEE CHAMPIONS SHOW WITH SAMPOORNESH BABU MK
Hyper Aadi: సంపూర్ణేష్ బాబును దారుణంగా మోసం చేసిన హైపర్ ఆది...ఫ్యాన్స్ ఫైర్
హైపర్ ఆది ఫోటోస్ (credit - insta - madhurasdesignerstudio)
హైపర్ ఆది(Hyper Aadi)కి పెద్ద చిక్కు వచ్చి పడింది. ముఖ్యంగా హైపర్ ఆది(Hyper Aadi) ఇంత కాలం జబర్దస్త్(Jabardasth)లో తన కామెడీ పంచులతో కానిచ్చేశాడు. స్కిట్స్ లో పెద్దగా పస లేకపోయినా, ఆది మాత్రం తన టైమింగ్ తోనూ, పంచులతోనూ రెచ్చిపోతూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఢీ(Dhee Champions) షోలో మాత్రం అతడి పప్పులేవీ ఉడకడం లేదు.
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది(Hyper Aadi) ఈ మధ్య తన ఉనికి కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. జబర్దస్త్ లో ఉన్నంత సేపు అతడిని పంచులతో ఎలాంటి టీమ్ అయినా వెనకడుగు వేసేది. కానీ ఢీలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ నుంచి అతడికి కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా హైపర్ ఆదికి యాంకర్ ప్రదీప్ నుంచి పెద్ద గండం వచ్చింది. ప్రదీప్(jabardasth) ఎనర్జీ ముందు హైపర్ ఆది పెద్దగా సరిపోలేదనే చెప్పాలి. బుల్లితెరపై తనదైన మార్కు చూపించిన ప్రదీప్ అంటే మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే హైపర్ ఆదిని ఢీ షోలో ప్రదీప్(anchor Pradeep) తెగ ఆడేసుకున్నాడనే చెప్పాలి. మరోవైపు సుడిగాలి సుధీర్ కూడా హైపర్ ఆదికి పెద్ద స్పీడ్ బ్రేకర్ అనే చెప్పాలి. తన మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ తో పాటు కామెడీ టైమింగ్ కూడా సుడిగాలి సుధీర్(Sudigali Sudheer)ది అదిరిపోతుంది. అయితే ఇక్కడే హైపర్ ఆదికి పెద్ద చిక్కు వచ్చి పడింది. ముఖ్యంగా హైపర్ ఆది ఇంత కాలం జబర్దస్త్ లో తన కామెడీ పంచులతో కానిచ్చేశాడు. స్కిట్స్ లో పెద్దగా పస లేకపోయినా, ఆది మాత్రం తన టైమింగ్ తోనూ, పంచులతోనూ రెచ్చిపోతూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఢీ షోలో మాత్రం అతడి పప్పులేవీ ఉడకడం లేదు. ముఖ్యంగా అతడికి జోడీగా వచ్చిన యాంకర్ వర్షిణి(anchor varshini) కూడా పెద్దగా చలాకీ యాంకర్ కాకపోవడం ఆదికి కలిసి రావడం లేదు.
హైపర్ ఆది, సంపూర్ణేష్ బాబు (Image: Youtube)
ఢీషోలో ఎలాగైనా తన సత్తా చాటేందుకు హైపర్ ఆది పడని పాట్లు అంటూ లేవనే చెప్పాలి. అయితే తాజాగా హైపర్ ఆది ఇక తన వల్ల కాదంటూ ఢీ షో నుంచి వెళ్లిపోదామనుకున్నాడు. అందుకు మల్లెమాల టీమ్ ఒప్పుకోలేదని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఇక తప్పదని భావించిన హైపర్ ఆది, డ్యాన్స్ ద్వారా ఆకట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. తాజాగా సుధీర్ కు సవాల్ విసురుతూ, హైపర్ ఆది ఒక రీల్ వదిలాడు. అందులో హైపర్ ఆద తెగ కష్టపడి డ్యాన్స్ చేశాడు. అయితే సుడిగాలి సుధీర్ చేసిన డ్యాన్స్ ముందు అది వెలవెల బోయిందనే చెప్పాలి. కానీ హైపర్ఆది మాత్రం తన ప్రయత్నం తాను చేసాడు. కానీ సుడిగాలి సుధీర్ డ్యాన్స్ ముందు తేలిపోయిందనే చెప్పాలి. అయితే తాను చేసిన డ్యాన్స్ చూసి హైపర్ ఆది స్క్రీన్ పై చూసి అతడే షాక్ తిన్నాడనే చెప్పాలి.
అయితే తాను డ్యాన్స్ చేసి ఇలా బుక్కయ్యాను ఏంట్రా అని ఆది తెగ ఫీల్ అయిపోతున్నాడట. అటు నెటిజన్లు మాత్రం హైపర్ఆది చేసిన డ్యాన్స్ ను చూస్తే, అచ్చం సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) ఇటీవల కొబ్బరి మట్లలో చేసిన డ్యాన్స్ గుర్తు చేశాడని ట్రోలింగ్ మొదలైంది. సుధీర్ అభిమానులు కొందరు హైపర్ ఆది డ్యాన్స్ ఇంకాస్త బాగా నేర్చుకొని పోటీకి దిగితే బాగుంటుందని చెప్పుకొస్తున్నారు. మరోవైపు హైపర్ ఆది మాత్రం తాను ఇలా బుక్ కావడంపై పెద్దగా స్పందించలేకపోయినప్పటికీ లోలోపల మాత్రం నాలుక కరుచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.