హోమ్ /వార్తలు /సినిమా /

హైపర్ ఆదికి అనుకోని వరం ఇచ్చిన అనసూయ...భర్త వద్దని వారించినా వినకుండా...

హైపర్ ఆదికి అనుకోని వరం ఇచ్చిన అనసూయ...భర్త వద్దని వారించినా వినకుండా...

అనసూయ, హైపర్ ఆది

అనసూయ, హైపర్ ఆది

అనసూయ, హైపర్ ఆది మధ్య సంథింగ్ సంథింగ్....ఉందని బుల్లితెరపై గాసిప్స్ ఎప్పటి నుంచి చెలామణిలో ఉన్నాయి. అయితే తాజాగా మాత్రం అనసూయ, హైపర్ ఆదికి ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చిందట...ఆ సంగతి తెలిసిన ఇండస్ట్రీ వాళ్లు షాక్ లో ఉన్నారట...ఇంతకీ ఆ ఆఫర్ ఏమిటంటే.

ఇంకా చదవండి ...

  బుల్లితెరపై రొమాంటిక్ పెయిర్ ఎవరంటే కచ్చితంగా సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ అని చెప్పేశేవారు.సుధీర్ కు రష్మీ కి ఎదో ఉందని గాసిప్స్ ఒక దశలో నెట్ ను షేక్ చేశాయి. అయితే వీరిద్దరి తర్వాత ఆ రేంజ్ లో కిక్ ఇస్తున్న పెయిర్, అనసూయ భరద్వాజ్..హైపర్ అది అనే చెప్పాలి. తన పంచ్ టైమింగ్ తో జబర్దస్త్ రేంజ్ ని పెంచేసిన కమెడియన్ ఆది. ఆది కనిపిస్తే చాలు ఎటువంటి పంచ్ లు వస్తాయో అని అందరూ ఎదురు చూస్తారు. ఆది స్కిట్ మొదలైందంటే చాలు ..అనసూయ మీద ఆది వేసే పంచ్ కోసం వీక్షకులు చూస్తారు. ఆ పంచ్ కి సిగ్గుపడుతూ అనసూయ రియాక్షన్ కూడా ఎప్పుడూ హిట్టే... అయితే తాజాగా హైపర్ ఆదికి అనసూయ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిసింది. ఇద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం సినిమాల కన్నా కూడా వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనసూయ, హైపర్ ఆదితో కలిసి ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  దీనికి సంబంధించి అనసూయ భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే హైపర్ ఆదికి కూడా తనతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే హైపర్ ఆదికి ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎలాంటి ఆఫర్లు రావడం లేదు. అనసూయ చేసిన ఈ పనికి ఆది థ్యాంక్స్ చెప్పినట్లు సమాచారం.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Anasuya Bharadwaj, Hyper Aadi, Jabardasth, Jabardasth comedy show

  ఉత్తమ కథలు