పండగ చేసుకుంటున్న హైపర్ ఆది ఫ్యాన్స్..

ఈ వారం సరికొత్త గెస్ట్‌లను తీసుకొచ్చారు హైపర్ ఆది. వాళ్లెవరో కాదు.. ఆది కుటుంబ సభ్యులు. ఆది తండ్రి, సోదరులు ఈ వారం జబర్దస్త్ వేదికపై సందడి చేశారు. అంతేకాదు ఆదితో కలిసి స్కిట్ చేసి కడుపుబ్బా నవ్వించారు.

news18-telugu
Updated: November 15, 2019, 2:20 PM IST
పండగ చేసుకుంటున్న హైపర్ ఆది ఫ్యాన్స్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలుగింట బుల్లితెరపై జబర్దస్త్‌కు ఉన్న క్రేజ్ మరే షోకు లేదేమో..! ప్రజల్లో అంతగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ ఖతర్నాక్ కామెడీ షో..! జబర్దస్త్‌కు ఎంతో మంది కొత్త నటులు వస్తుంటారు. కొందరు వెళ్లిపోతుంటారు. ఇక అప్పుడప్పుడూ స్పెషల్ గెస్ట్‌లు కూడా వస్తుంటారు. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ, సోషల్ మీడియాకు చెందిన అతిథులు మాత్రమే వచ్చారు. కానీ ఈ వారం సరికొత్త గెస్ట్‌లను తీసుకొచ్చారు హైపర్ ఆది. వాళ్లెవరో కాదు.. ఆది కుటుంబ సభ్యులు. ఆది తండ్రి, సోదరులు ఈ వారం జబర్దస్త్ వేదికపై సందడి చేశారు. అంతేకాదు ఆదితో కలిసి స్కిట్ చేసి కడుపుబ్బా నవ్వించారు.

జబర్దస్త్ స్టేజిపై హైపర్ ఆది తండ్రి నరసింహారావు పద్యాలతో టీమ్ మేట్స్‌ను నసపెట్టి.. నవ్వులు పూయించారు. గుక్క తిప్పకోకుండా పద్యాలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఆది సోదరులు వేణుబాబు, రాంబాబు సైతం పంచ్‌లు వేసి కామెడీ పండించారు. తన తండ్రి నరసింహారావు నాటకాల్లో నటిస్తాడని.. అందుకే పద్యాలను అలవోకగా పాడతారని చెప్పాడు ఆది. ఇక వారందరి ముందు ఆదిపై జడ్జిలు నాగబాబు, రోజా ప్రశంసలు కురిపించారు. ఆది చాలా తెలివైన వాడని, మంచివాడని చెప్పారు నాగబాబు. పంచులతో తమ కష్టాలను హైపర్ ఆది మరిపిస్తాడని మెచ్చుకున్నారు రోజా.

First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...