Home /News /movies /

HYPER AADI EXPLAIN ABOUT SECRET DATING WITH A GIRL IN A PRIVATE PARTY MK

హైపర్ ఆది ఆ అమ్మాయితో రోజంతా అదే పనిగా...షాకింగ్...

హైపర్ ఆది ఫోటోస్ (credit - insta - madhurasdesignerstudio)

హైపర్ ఆది ఫోటోస్ (credit - insta - madhurasdesignerstudio)

సుడిగాలి సుధీర్, ప్రదీప్ లకు ఉన్నంత క్రేజ్ అమ్మాయిల్లో హైపర్ ఆదికి లేదనే అంటారు. కానీ ఓ టైప్ మాస్ అమ్మాయిలు మాత్రం హైపర్ ఆది అంటే పడి చస్తారట.

    హైపర్ ఆది అంటే మాస్...మాస్ అంటే హైపర్ ఆది...నిజానికి తనను ఫాలో అయ్యే వాళ్లలో, చాలా మంది అమ్మాయిలు కూడా మాస్ ప్రేక్షకులే ఉంటారని హైపర్ ఆదే స్వయంగా చెప్పాడు. అలాంటి హైపర్ ఆది బయటకు వెళితే తనను ఫాలో అయ్యే వాళ్లు కూడా అంతా మాస్ వ్యవహారమే ఉంటుంది. అయితే హైపర్ ఆది అంటే అమ్మాయిల్లో అంత ఫాలోయింగ్ లేదనే పేరుంది. ఎందుకంటే, సుడిగాలి సుధీర్, ప్రదీప్ లకు ఉన్నంత క్రేజ్ అమ్మాయిల్లో హైపర్ ఆదికి లేదనే అంటారు. కానీ ఓ టైప్ మాస్ అమ్మాయిలు మాత్రం హైపర్ ఆది అంటే పడి చస్తారట. తాజాగా తనకు ఎదురైన ఓ సంఘటనను ఉదాహరణగా ఆది చెప్పుకొచ్చాడు. ఈ మధ్యకాలంలో ఒంగోలులో ఓ ఫంక్షన్ కు వెళ్లానని, అయితే అక్కడ ఓ అమ్మాయి వచ్చి తన పక్కన కూర్చుందని, గలగల మాట్లాడటమే కాదు, సెల్ఫీలు కూడా దిగిందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి తనతో మాట్లాడించిందని చెప్పాడు. అయితే తాను ఎక్కడికి వెళ్లినా వదలకుండా రోజంతా తనతోనే ఆ అమ్మాయి గడిపిందంటూ, ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొస్తు, సిగ్గు పడ్డాడు. దీంతో అసలు సంగతి బయటపడింది. హైపర్ ఆది కనిపించడు కానీ, చాలా విషయమే ఉందంటూ అతడి ఫాలోయర్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ సీక్రెట్ డేటింగ్ ఎంత వరకూ దారి తీస్తుందో చూడాలి మరి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Hyper Aadi, Jabardasth comedy show

    తదుపరి వార్తలు