హోమ్ /వార్తలు /సినిమా /

జబర్ధస్త్‌లో మరోసారి MLA రోజాను టార్గెట్ చేసిన హైపర్ ఆది..

జబర్ధస్త్‌లో మరోసారి MLA రోజాను టార్గెట్ చేసిన హైపర్ ఆది..

రోజా, హైపర్ ఆది (Roja Hyper Aadi)

రోజా, హైపర్ ఆది (Roja Hyper Aadi)

జబర్దస్త్‌లో హైపర్ ఆది వేసే పంచ్‌లకు నవ్వని వారుండరు. స్కిట్‌లో కూడా అందరికి సమ ప్రాధాన్యం ఇస్తాడు. తాజాగా ప్రసారమయిన ఎపిపోడ్‌లో హైపర్ ఆది మరోసారి రోజాను టార్గెట్ చేసాడు.

  జబర్దస్త్‌లో హైపర్ ఆది వేసే పంచ్‌లకు నవ్వని వారుండరు. స్కిట్‌లో కూడా అందరికి సమ ప్రాధాన్యం ఇస్తాడు. తాను ఎదుగుతూనే తోటి ఆర్టిస్టులు కూడా ఎదగడానికి దోహదపడతాడు. అందుకే అతడి స్కిట్‌లో చేయడానికి రోజా, అనసూయ కూడా సై అన్నారు. అందుకే సుధీర్‌తో పాటు టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నాడు. ఐతే..  లాక్‌డైన్ తర్వాత  చాలా రోజుల తర్వాత  స్మాల్ స్క్రీన్ పై జరబ్ధస్త్ షో మళ్లీ మొదలైంది. దాదాపు మూడు నెలల లాంగ్ తర్వాత వచ్చిన కొత్త ఎపిసోడ్‌‌లో పార్టిసిపేట్స్ తమదైన రీతిలో స్కిట్స్ చేసి నవ్వించారు. ఇక హైపర్ ఆది.. రెండాకులు ఎక్కువే అన్నట్టు ఏకంగా బాలయ్యపైనే స్కిట్ చేసి చూపించాడు. ఇక హైపర్ ఆది ఎప్పటికపుడు సమాజంలో జరుగుతున్న వాటిపై తనదైన శైలిలో పంచ్‌లు వేయడం మనకు తెలిసిందే కదా. గతంలో ఆడవారి పార్టీలకు అర్థాలే వేరులే షోలో, యాంకర్లను ఉద్దేశిస్తూ వారిని గ్రామవాలంటీర్లతో పోల్చుతూ ఆది చేసిన కామెంట్స్ పై వివాదంగా మారాయి. అయితే ఈ కామెంట్స్ చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే రోజా సైతం అదే షోలో ప్రత్యేక అతిథిగా ఉన్నప్పటికీ, అదేమీ పట్టించుకోని హైపర్ ఆది యాంకర్లపై గ్రామ వాలంటీర్లతో పోల్చుతూ చేసిన కామెంట్స్ అగ్గి రాజేశాయి. దీనిపై అప్పట్లో పెద్ద రచ్చే నడిచింది.

  MLA Roja kidnap drama in Jabardasth Comedy Show and Hyper Aadhi designed a skit on it pk అదేంటి.. రోజా కిడ్నాప్ ఏంటి అనుకుంటున్నారా..? ఏం చేస్తాం మరి.. వీడియో ప్రూఫ్ కూడా వచ్చిన తర్వాత నమ్మక తప్పని పరిస్థితి. తన ఇమేజ్ కూడా పణంగా పెట్టేసి రోజా చేస్తున్న కార్యక్రమం జబర్దస్త్ కామెడీ షో. MLA Roja kidnap,MLA Roja kidnap drama,MLA Roja kidnap skit,MLA Roja kidnap skit jabardasth,MLA Roja kidnap hyper aadi,jabardasth comedy show,hyper aadi skits,mla roja kidnap in jabardasth,jabardasth latest promo,jabardasth latest episode,jabardasth hyper aadi skit,jabardasth next week promo,jabardasth promo,jabardasth comedy show promo,telugu cinema,హైపర్ ఆది,రోజా,రోజా ఎమ్మెల్యే,ఎమ్మెల్యే రోజా హైపర్ ఆది,ఎమ్మెల్యే రోజా కిడ్నాప్,తెలుగు సినిమా
  ఎమ్మెల్యే రోజా హైపర్ ఆది

  తాజాగా హైపర్ ఆది మరోసారి రోజాను టార్గెట్ చేసాడు. జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది స్కిట్ ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన చేసే స్కిట్‌లో విషయం తక్కువ.. పంచులు ఎక్కువగా ఉంటాయి. అసలు ఒక్కోసారి కాన్సెప్ట్ లేకుండానే కామెడీ చేస్తుంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. సుధీర్ఘ విరామం తర్వాత ప్రసారమైన  ఎపిసోడ్‌లో రోజాను దారుణంగా టార్గెట్ చేసాడు ఆది. స్కిట్‌‌లో భాగంగానే రోజాపై పంచులు కురిపించినా కూడా మరోసారి ఆమె టార్గెట్ అయిపోయింది. జబర్దస్త్ కాకుండా మరో ప్రోగ్రామ్ కూడా చేస్తుంది రోజా. బతుకు జట్కాబండి, రచ్చ బండ వంటి ప్రోగ్రామ్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఐతే.. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య గొడవలు మొదలయ్యాయన్నట్టు మాట్లాడాడు. దీంతో ఆమె చేసే ఈ తరహా కార్యక్రమానికి భార్యాభర్తలు పోలో మంటూ తరలి వస్తారంటూ ఒకింత ఘాటుగానే పంచ్‌లు వేసాడు. ఈయన వేసిన జోకులకు రోజా మొహం తెల్లబడిపోయింది. అటు మనోపై కూడా తనదైన శైలిలో పంచ్‌లు వేసాడు. మనో జడ్జ్‌గా అడుగుపెట్టాడో లేదో అపుడు మూడు నెలలు బ్రేక్ వచ్చిందంటూ ఆయన్ని కూడా వదల్లేదు. మొత్తంగా లాంగ్ గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది మరోసారి తన పంచ్‌లను పదును పెట్టాడు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Hyper Aadi, Jabardasth comedy show, MLA Roja, Singer Mano

  ఉత్తమ కథలు