Home /News /movies /

HYPER AADI CONVINCED MALLEMALA TEAM AND DORABABU RE ENTRY INTO JABARDASTH COMEDY SHOW TA

జబర్ధస్త్ షోలో మళ్లీ దొరబాబు.. హైపర్ ఆది కొత్త కండిషన్స్ ..

దొరబాబు,  హైపర్ ఆది (Hyper Aadi Dorababu)

దొరబాబు, హైపర్ ఆది (Hyper Aadi Dorababu)

జబర్దస్త్ షో ఎంతో మంది నటులకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. సినిమాల్లో ప్రయత్నాలు చేసే నటులకు జబర్థస్త్ అనేది ఒక వేదికగా మారింది. హైపర్ ఆది స్కిట్‌లో దొరబాబు కీ రోల్ పోషించేవాడు. జబర్ధస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఒకే ఒక్క పనితో తన పరువును బజారున పడేసుకున్నాడు. తాజాగా దొరబాబు.. జబర్ధస్త్ షోలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
    జబర్దస్త్ షో ఎంతో మంది నటులకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. సినిమాల్లో ప్రయత్నాలు చేసే నటులకు జబర్థస్త్ అనేది ఒక వేదికగా మారింది. ఈ షో తర్వాత చాలా మంది జబర్ధస్త్ నటులు సినిమాల్లో కమెడియన్స్‌గా సత్తా చూపెట్టారు. ఇంకొందరు ఏకంగా హీరోలుగా మారిపోయారు. కానీ జబర్ధస్త్ స్కిట్‌లతో హైపర్ ఆది స్కిట్ సెపరేట్ అనే చెప్పాలి. ఆయన స్కిట్స్ కోసమే ఈ షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. హైపర్ ఆది స్కిట్‌లో దొరబాబు కీ రోల్ పోషించేవాడు. జబర్ధస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఒకే ఒక్క పనితో తన పరువును బజారున పడేసుకున్నాడు. రీసెంట్‌గా వైజాగ్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అసలు దొరబాబు నిజంగానే వ్యభిచారం చేస్తూ పట్టుపడ్డాడా.. కాదు కాదు.. కావాలనే ఆయన్ని ఈ కేసులో ఇరకించారని మరికొందరు వాదిస్తున్నారు. దొరబాబు భార్య మాత్రం దొరబాబు ఏంటో నాకు తెలుసు. అతను అలాంటి తప్పు చేసి ఉండడు అంటోంది.  ఏది ఏమైనా దొరబాబు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. మొత్తానికి జబర్ధస్త్ నటుల్లో ఎవరు ఇతను వ్యభిచారం చేస్తూ దొరికాడంటే ఏదో తేడా ఉన్నట్టే అని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఆడియన్స్ దృష్టిలో దొరబాబు పై బ్యాడ్ రిమార్క్ పడిపోయింది.

    జబర్దస్త్ నటుడు దొరబాబు (Jabardasth Comedian Dorababu)
    జబర్దస్త్ నటుడు దొరబాబు (Jabardasth Comedian Dorababu)


    ఆ రోజు ఏదో పని మీద వైజాగ్ వచ్చిన దొరబాబు, పరదేశీని అక్కడే ఉన్న కామన్ ఫ్రెండ్ ఒకరు ఆ చోటికి తీసుకెళ్లాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వ్యభిచారం జరుగుతున్న పక్క ఫ్లాట్‌లోనే కొందరు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో వాళ్లు రైడింగ్‌కు వచ్చారు. అక్కడ పేకాట ఆడుతున్న వాళ్లపై రైడింగ్‌కు వస్తే.. అక్కడే ఉన్న జబర్దస్త్ కమెడియన్లు కూడా వ్యభిచారం చేస్తూ రైడింగ్‌లో పట్టుబడ్డారు.

    వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన జబర్దస్త్ నటులు (Dora Babu Paradeshi prostitution)
    వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన జబర్దస్త్ నటులు (Dora Babu Paradeshi prostitution)


    తాజాగా జరిగిన సంఘటనతో మల్లెమాల టీమ్.. దొరబాబును బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్టు సమాచారం. దీంతో హైపర్ ఆది కలగజేసుకొని మల్లెమాల టీమ్‌తో మాట్లాడి మరలా దొరబాబు జబర్ధస్త్ టీమ్‌లో వచ్చేలా వాళ్లను కన్విన్స్ చేసినట్టు సమాచారం. అతడు తెలిసి చేసాడో తెలియక చేసాడో.. ఇకపై ఎలాంటి వివాదాలకు పోనని హామి ఇస్తేనే అతన్ని తీసుకుంటామని చెప్పారట. ఒకవేళ అతను పట్టుపడితే.. హైపర్ ఆది కూడా షో నుంచి తీసేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి దొరబాబు అనే  వ్యక్తిపై ఒక ముద్ర పడిన తర్వాత ప్రేక్షకుల్లో కూడా అదే రకమైన భావం కలుగుతోంది. ఇపుడు దొరబాబు జబర్ధస్త్‌లో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటిలా తన కామెడీని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Hyper Aadi, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు