హోమ్ /వార్తలు /సినిమా /

హైపర్ ఆది కామెంట్‌తో మెగా ఫ్యాన్స్ ఖుషీ...షాక్‌లో రోజా..షో మధ్యలోనే

హైపర్ ఆది కామెంట్‌తో మెగా ఫ్యాన్స్ ఖుషీ...షాక్‌లో రోజా..షో మధ్యలోనే

రోజా, హైపర్ ఆది

రోజా, హైపర్ ఆది

షో ఎంట్రీలో తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సాంగ్ తో హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. ఇలా హైపర్ ఆది మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    మెగా ఫ్యామిలీ అంటే హైపర్ ఆదికి ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ నాగబాబు అంటే హైపర్ ఆదికి వల్లమాలిన అభమానం. ఎలక్షన్స్ టైమ్ లో అయితే నాగబాబుకు ఓటు వేయమని సైతం హైపర్ ఆది ప్రచారం చేసిన మాట నిజమే. అయితే జబర్దస్త్ వేదికపై ఉన్న జడ్జి రోజా అంటే కూడా హైపర్ ఆదికి మంచి గౌరవమే ఉంది. తాజాగా నాగబాబు జబర్దస్త్ వదిలి వెళ్లిపోయాక, వారితో పాటు హైపర్ ఆది కూడా వెళ్లిపోతాడనే ప్రచారం జరిగింది. అయితే ఏమైందో తెలియలేదు కానీ, హైపర్ ఆది మాత్రం జబర్దస్త్ తోనే కంటిన్యూ అవుతున్నాడు. దీని వెనుక ఎమ్మెల్యే రోజా ఇచ్చిన సలహానే హైపర్ ఆది జబర్దస్త్ విడిచి వెళ్లకుండా ఉండేందుకు పనిచేసిందనే టాక్ కూడా ఉంది. అందుకు తగ్గట్టుగానే హైపర్ ఆదికి ప్రమోషన్‌గా ఢీ యాంకరింగ్ కూడా దక్కింది.

    ఇదిలా ఉంటే నాగబాబును మరిచిపోలేని హైపర్ ఆది తాజాగా జబర్దస్త్ ఎపిసోడ్‌లో ఆయనను గుర్తుచేసేలా కామెంట్ చేశాడు. ఆది వేసిన పంచ్ ఇలా ఉంది: నవ్వడానికి రెండో జడ్జ్ లేడంటే...నడవడానికి రాజమండ్రి బ్రిడ్జి కావాలందట నీలాంటిది...అంటూ నాగబాబు లేని లోటును గుర్తు చేశాడు. అంతేకాదు షో ఎంట్రీలో తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సాంగ్ తో హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. ఇలా హైపర్ ఆది మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: Hyper Aadi, Hyper Adi, Jabardasth, Jabardasth comedy show, MLA Roja

    ఉత్తమ కథలు