HYPER AADI COMMENTS ON ADIRINDI SHOW PARTICIPANTS TA
వాళ్లకు హైపర్ ఆది వార్నింగ్... నా రికార్డులు బ్రేక్ చేయమని చెప్పు అంటూ..
హైపర్ ఆది ఫేస్ బుక్ ఫోటో (Source: Facebook)
తెలుగు టెలివిజన్ ఛానెల్స్‌లో జబర్ధస్త్ ప్రోగ్రామ్ చూసేవాళ్లకు హైపర్ ఆది సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆయన అదిరింది పోగ్రామ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.
తెలుగు టెలివిజన్ ఛానెల్స్‌లో జబర్ధస్త్ ప్రోగ్రామ్ చూసేవాళ్లకు హైపర్ ఆది సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఆయన వేసే పంచ్‌ల గురించి ఈ షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జబర్ధస్త్ షోకు మొన్నటి వరకు జడ్జ్‌గా ఉన్న నాగబాబు.. వేరే ఛానెల్లో జబర్ధస్త్ తరహాలో ‘అదిరింది’ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ షో లో ఒక పార్టిసిపేంట్ సద్దాం చేసే స్కిట్ రేటింగ్ హైపర్ ఆది కంటే ఎక్కువ వచ్చిందనే విషయమై హైపర్ ఆది స్పందించారు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ... నా విషయంలో గత ఐదేళ్లుగా ఒకే షోలో ఒకే టీమ్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నానన్నారు. అంతేకానీ ఎవరు భ్రమల్లో బ్రతుకొద్దు అని హైపర్ ఆది పంచ్ వేసాడు. గత ఐదేళ్లుగా జబర్ధస్త్ షో ఎంత మంచి రేటింగ్ వచ్చిందో ఈ సందర్భంగా గుర్తు చేసారు. అందులో హైపర్ ఆది తాను చేసే ప్రోగ్రామ్స్ 100కి పైగా ఒక్కొక్కటి దాదాపు 10 మిలియన్ వ్యూస్ పైగా వచ్చాయని చెప్పుకొచ్చారు. ఒకరి టాలెంట్‌ను అంచనా వేయడానికి ఐదు వారాల ఎపిసోడ్స్ సరిపోతాయా అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఒక షోను మరో షోతో పోల్చడం కుదరదన్నారు.
హైపర్ ఆది సద్దాం హుస్సేన్ (hyper aadi saddam)
అలాగే యూట్యూబ్‌లో 20 మిలియన్ వ్యూస్‌కు వచ్చిన స్కిట్స్ వీడియోలు 5కు పైగానే ఉన్నాయన్నారు. 30 మిలియన్ వ్యూస్ వచ్చినవి కూడా ఉన్నాయన్నారు. సుమారు 60 మిలియన్లు వచ్చిన వీడియోలు కూడా నా కెరీర్లో ఉన్నాయి. హైపర్ ఆదిని క్రాస్ చేయాలంటే వీటన్నంటినీ క్రాస్ చేయాలని చెప్పుకొచ్చాడు. ఎవరైనా ఇలాంటి రికార్డులు దాటితేనే వాళ్లు గ్రేట్ అని ఒప్పుకుంటాను అని హైపర్ ఆది అన్నారు. నా విషయం పక్కన పెడితే.. సుడిగాలి సుధీర్, ఛమ్మక్ చంద్ర గత ఏడేళ్లుగా జబర్ధస్త్ షోలో టీమ్ లీడర్లుగా ఉన్నారు. వారిని దాటి చూపించమనండి వాళ్లను. వాళ్లకు వచ్చే ఒక మిలియనో లేదా రెండు మిలియన్లు నేను టీమ్ మెంబర్‌గా ఉన్న సమయంలో నాకు వచ్చేవన్నారు. ఇలా పోలీకలు పెట్టుకోవడం మంచిది కాదన్నారు. ఎవరి ప్రతిభ, టాలెంట్ వారికే చెందుతుంది. తాము గొప్ప అనేది ఇతరులను చిన్నచూపు చూడవద్దని హైపర్ ఆది గుర్తు చేసారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.