జబర్దస్త్‌కు కొత్త జడ్జికి హైపర్ ఆది కీలక సూచన...ఇక నాగబాబు లేని లోటు తీరినట్లే...

(Image: youtube)

నిజానికి జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోయినప్పటి నుంచి రోజాతో పాటు కలిసి చేసేందుకు జడ్జి స్థానం సెట్ అవ్వడం లేదు. నరేష్, ఆలీ, పోసానిలతో ట్రైచేసినప్పటికీ, వారంతా సినిమాల్లో బిజీగా ఉండటంతో ప్రస్తుతానికి జడ్జి ప్లేస్ లో అనిశ్చితి కొనసాగుతోంది.

  • Share this:
    నాగబాబు ఎగ్జిట్ అయినప్పటి నుంచి ఆ ప్లేస్ లో జడ్జిగా ఎవరు వస్తారా అనే సస్పెన్స్ ఇన్ని రోజులు కొనసాగింది. అయితే ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో జడ్జ్ కనబడటంతో అంతా కన్ఫ్యూజ్ అయ్యారు. కొన్ని ఎపిసోడ్స్ లో నరేష్, పోసాని ఇలా వరుసగా మారుతూ వస్తున్నారు. అయితే తాజాగా ప్రసారం అయిన ప్రోమోలో ఈ సారి ప్రముఖ సింగర్ మనో కనిపించారు. అయితే ఈ సారి మాత్రం జబర్దస్త్ కు ఫుల్ టైమ్ జడ్జి దొరికినట్లే అని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ జడ్జి సీటులో కొనసాగాలంటే మాత్రం ఏం చేయాలి అనే దానిపై హైపర్ ఆది క్లారిటీ ఇచ్చేశాడు. ఎంచక్కా నవ్వుతూ ఉంటే పది ఎపిసోడ్ల పాటు మీరే జడ్జి అంటూ సింగర్ మనోకు హింట్ ఇచ్చాడు.

    నిజానికి జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోయినప్పటి నుంచి రోజాతో పాటు కలిసి చేసేందుకు జడ్జి స్థానం సెట్ అవ్వడం లేదు. నరేష్, ఆలీ, పోసానిలతో ట్రైచేసినప్పటికీ, వారంతా సినిమాల్లో బిజీగా ఉండటంతో ప్రస్తుతానికి జడ్జి ప్లేస్ లో అనిశ్చితి కొనసాగుతోంది. అయితే మనో ఎంట్రీతో ఆ కొరత తీరినట్లే అని అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
    Published by:Krishna Adithya
    First published: