Hyper Aadi : ఒక్కోసారి సినిమాల్లో జరిగిన కొన్ని సంఘటలను చూస్తుంటే.. సినిమాటిక్‌గా జరిగిందని ప్రస్తావిస్తూ ఉంటారు. అలా అచ్చం మనీ సినిమాలో బ్రహ్మానందంను శ్రీదేవి సరసన హీరో చేస్తానంటూ తనికెళ్ల భరణి.. మోసం చేసే సీన్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనీ’ సినిమాలో ఖాన్‌దాదా(బ్రహ్మానందం) ను హీరో చేస్తానంటూ మాణిక్యం (తనికెళ్ల భరణి)మోసం చేస్తాడు. ఈ సందర్భంగా వారెవా ఏమి ఫేసు అంటూ ఖాన్ దాదాతో సినిమా తీస్తానంటూ డబ్బులు తీసుకొని ఉడాయిస్తాడు. అచ్చం అలాంటి సంఘటనే హైపర్ ఆది విషయంలో జరిగిందట. తాజాగా ఇతను ఆలీ హోస్ట్‌గా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొని సినిమా అవకాశాల కోసం ఒక అతను తనను మోసం చేసిన సంఘటనను గుర్తుకు చేసుకున్నాడు.
జబర్ధస్త్ కమెడియన్‌గా పేరు తెచ్చుకుంటున్న తరుణంలో ఒకతను హైపర్ ఆదికి ఫోన్ చేసాడట.అంతేకాదు తనకు ఓ వంద రూపాయలు రీఛార్జ్ చేయమని చెప్పాడట. అతను చెప్పినట్టే హైపర్ ఆది రీ ఛార్జ్ చేసాడట. ఆ తర్వాత ఓ రమ్మని పిలిచాడ. వెళ్లిన తర్వాత రూ. కొన్ని కోట్లతో సినిమా తీయబోతున్నట్టు ప్రకటించాడు. అందులో తనకు ఓ మంచి వేషం ఇస్తానని చెప్పాడట. ఈ సందర్భంగా అతను ఓ సిగరెట్ ప్యాకెట్ తీసుకొని రమ్మని హైపర్ ఆదికి చెప్పాడట. కోట్లతో సినిమా తీసే అతను ఇలా అడగడంతో తనకు డౌట్ కూడా వచ్చిందని చెప్పాడు. కానీ అవకాశం కోసం అతను అడిగిన వన్ని తెచ్చి ఇచ్చాను. ఆ తర్వాత నెక్ట్స్ డే ఓ స్టూడియో దగ్గరకు రమ్మని చెప్పాడు. అతను చెప్పినట్టే ఆ తర్వాతి రోజు వెళితే.. ఎవరు రాలేదని హైపర్ ఆది చెప్పాడు. ఆ తర్వాత తాను మోసపోయనట్టు తెలుసుకున్నట్టు తెలిపాడు. ఎంత తెలివి ఉన్న ఒక్కోసారి అవకాశాల కోసం ఒకరు వేసిన ఉచ్చులో పడిపోతాం అంటూ హైపర్ ఆది తనకు జరిగిన అనుభవాలను చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా బ్రహ్మానందం తనకు ఓ సందర్భంలో ఫోన్ చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. అపుడు ఆయన ఫోన్ చేసాడని నేను అనుకోకుండా...ఎవరో కావాలనే బ్రహ్మానందం పేరుతో తనకు ఫోన్ చేసి ఆట పట్టిస్తున్నానుకున్నాను. ఆ తర్వాత బ్రహ్మానందం గారని తెలియడంతో ఆయనకు క్షమించమని వేడుకున్నట్టు ఈ సందర్భంగా బ్రహ్మానందంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు హైపర్ ఆది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ali, Brahmanandam, Hyper Aadi, Tollywood