హైపర్ ఆది యాంకర్స్ అందరికీ బావ అయిపోతున్నాడుగా..

హైపర్ ఆది ఫోటోస్ (credit - insta - madhurasdesignerstudio)

Hyper Aadi: వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది. చందమామ అందరికీ మామ అయినట్లు ఇప్పుడు హైపర్ ఆది కూడా జబర్దస్త్ కామెడీ షోలో అందరు యాంకర్స్‌కు బావ అయిపోతున్నాడు.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం పంచ్ డైలాగ్ అనే పేరు వినగానే మరో ఆలోచన లేకుండా హైపర్ ఆది పేరు గుర్తుకొస్తుంది. మనోడు జబర్దస్త్ కామెడీ షోలో కడుపులు చెక్కలయ్యేలా నవ్విస్తున్నాడు. ఈ కమెడియన్ క్రేజ్ ఇప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని సినిమాలకు డైలాగులు కూడా రాస్తున్నాడు ఈయన. ఇదిలా ఉంటే తన గ్రౌండ్ అయిన జబర్దస్త్ కామెడీ షోలో ఇష్టమొచ్చినట్లు ఆడేసుకుంటున్నాడు ఈయన. ముఖ్యంగా పంచుల వర్షం కురిపిస్తున్నాడు. తన ప్రతి స్కిట్‌లో కూడా సెలబ్రిటీస్‌ను తీసుకొస్తున్నాడు ఆది. అందులో వాళ్లపైనే పంచులు వేస్తున్నాడు.

హైపర్ ఆది ఫోటోస్ (credit - insta - madhurasdesignerstudio)
వర్షిణి, హైపర్ ఆది (Image: youtube)


ఇప్పటికే చాలా మందిని తన స్కిట్స్ కోసం వాడేసుకున్నాడు ఈ కమెడియన్. గతవారం బిగ్ బాస్ రోహిణి వచ్చింది.. అంతకుముందు వర్షిణి.. దానికి ముందు శ్రీముఖి.. ఇలా ప్రతీ ఎపిసోడ్ కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు హైపర్ ఆది. ఈ వారం సీనియర్ యాంకర్ మంజూష వచ్చింది. ఆమెపై కూడా హైపర్ ఆది పంచులు ఆగలేదు. వీళ్లంతా ఒకెత్తు అయితే అనసూయ మాత్రం ఎప్పుడూ ఆదికి సపోర్టుగానే ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే చాలా స్కిట్స్ చేసారు.. అవి సూపర్ హిట్ అయ్యాయి కూడా.

హైపర్ ఆది ఫోటోస్ (credit - insta - madhurasdesignerstudio)
హైపర్ ఆది ఫోటోస్ (credit - insta - madhurasdesignerstudio)


మొన్నామధ్య ఓ స్కిట్‌లో భాగంగా తనను బావ అని పిలిపించుకున్నాడు ఆది. రోహిణి, శ్రీముఖి లాంటి యాంకర్స్ కూడా ఆదిని బావా అని పిలిచారు. ఇప్పుడు మంజూషతో కూడా బావ అని పిలిపించుకున్నాడు హైపర్ ఆది. ప్రతీ స్కిట్‌లో బావ అని పిలిపించుకుని.. మళ్లీ తనపై తానే సెటైర్లు వేసుకుంటున్నాడు ఆది. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. మంజూషతో బావా అని పిలిపించుకుని మరీ పంచులు వేసుకున్నాడు. ఏదేమైనా కూడా కరెంట్ ఎఫైర్స్ కూడా కరెక్టుగా వాడేస్తూ వరస స్కిట్స్.. హిట్స్ కొట్టేస్తున్నాడు ఈ జబర్దస్త్ కమెడియన్.
Published by:Praveen Kumar Vadla
First published: