హోమ్ /వార్తలు /సినిమా /

హైపర్ ఆది దెబ్బకు యాంకర్ ప్రదీప్‌ ఔట్...వర్షిణి రికమండేషన్‌‌తో చంటికి ప్రమోషన్...

హైపర్ ఆది దెబ్బకు యాంకర్ ప్రదీప్‌ ఔట్...వర్షిణి రికమండేషన్‌‌తో చంటికి ప్రమోషన్...

(Image: Youtube)

(Image: Youtube)

కొత్త జోడీగా ఢీలోకి ప్రవేశించిన హైపర్ ఆది, వర్షిణి మొదట్లో కాస్త తడబాటుకు గురైనప్పటికీ తర్వాత తర్వాత పుంజుకుంటున్నారు. ఈ క్రమంలో యాంకర్ ప్రదీప్ హైపర్ ఆదికే పంచులతో గుక్క తిప్పుకోనివ్వకుండా ఇబ్బంది పెట్టినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి.

ఇంకా చదవండి ...

  ఢీ షోలో పాత్రలు, పాత్రధారులు మారిపోతున్నాయి. స్టార్టింగ్ నుంచి సుడిగాలి సుధీర్, రష్మీ అలాగే కొనసాగుతున్నప్పటికీ యాంకర్ విషయంలో మాత్రం క్లారిటీ ఉండట్లేదు. సుదీర్ఘ కాలం యాంకర్ ప్రదీప్ షో నిర్వహణ బాధ్యతను నెత్తిన వేసుకున్నప్పటికీ మధ్యలో కొంత కాలం ఆ ప్లేస్ లో యాంకర్ రవి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడు కూడా ఎగ్జిట్ అయిపోవడంతో మరోసారి ప్రదీప్ రీఎంట్రీ ఇచ్చాడు. అయితే కథ ఇక్కడితో సుఖాంతం అవ్వలేదు. కొత్త జోడీగా ఢీలోకి ప్రవేశించిన హైపర్ ఆది, వర్షిణి మొదట్లో కాస్త తడబాటుకు గురైనప్పటికీ తర్వాత తర్వాత పుంజుకుంటున్నారు. ఈ క్రమంలో యాంకర్ ప్రదీప్ హైపర్ ఆదికే పంచులతో గుక్క తిప్పుకోనివ్వకుండా ఇబ్బంది పెట్టినట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. అయితే జబర్దస్త్ స్టేజి పైన మకుటం లేని మహారాజుగా పేరొందిన హైపర్ ఆది, ఢీలో కాస్త వీక్ అయినట్లే కనిపించాడు. దానికి తోడు యాంకర్ ప్రదీప్ చేస్తున్న ర్యాగింగ్ మామూలుగా ఉండట్లేదు. ఈ దెబ్బతో సోషల్ మీడియాలో హైపర్ ఆది ఫ్యాన్స్ ప్రదీప్ ను టార్గెట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

  అయితే అటు జబర్దస్త్‌తో సంబంధం లేని యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం మరో చానెల్ లో ఇదే తరహా ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతడి ప్లేస్ లో జబర్దస్త్‌లో కమెడియన్ ను హోస్ట్ గా తెస్తే ఎలా ఉంటుందని టీమ్ యోచించినట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే పటాస్ షోలో తన సత్తా చాటిన చలాకీ చంటి ఢీ షో హోస్ట్ గా ప్రమోషన్ దక్కింది. పటాస్‌లో వర్షిణి, చలాకీ చంటి కలిసి పండిస్తున్న కామెడీ కూడా చంటి ఎంట్రీకి ఉపయోగపడుతుందని టాక్ వినిపిస్తోంది.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Anchor pradeep, Hyper Aadi, Hyper Adi

  ఉత్తమ కథలు