Home /News /movies /

HYPER AADI AND NAGABABU SPLIT IN JABARDASTH COMEDY SHOW WILL EFFECT ON JANASENA MK

హైపర్ ఆదికి జనసేనకు మధ్య తెగిన బంధం...కారణం అదేనా..?

హైపర్ ఆది జనసేన

హైపర్ ఆది జనసేన

స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని అయిన హైపర్ ఆది, పలుస్కిట్లలో ఆయనను ఇమిటేట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ మద్దతు కూడా భారీగా పొందాడు. అలాగే నాగబాబుతో సైతం హైపర్ ఆదికి మంచి రిలేషన్ ఉంది.

    జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది అంటే మెగా  అభిమానిగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ఏపీ ఎన్నికల్లో హైపర్ ఆది భీమవరంలో జనసేన అభ్యర్థిగా పోటీచేసిన నాగబాబుకు మద్దతుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని అయిన హైపర్ ఆది, పలుస్కిట్లలో ఆయనను ఇమిటేట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ మద్దతు కూడా భారీగా పొందాడు. అలాగే నాగబాబుతో సైతం హైపర్ ఆదికి మంచి రిలేషన్ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోవడం, జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్ పేరిట కొత్త ప్రోగ్రాం మొదలు పెట్టడం గడిచిపోయాయి. అంతేకాదు నాగబాబుతో పాటు ఇప్పటికే చమ్మక్ చంద్ర లాంటి సీనియర్లు సైతం తమ టీములతో సహా వదిలివెళ్లిపోయారు. అయితే నాగబాబుతో పాటు లోకల్ గాంగ్స్ ప్రోగ్రామ్ లోకి హైపర్ ఆది ఆటోమేటిక్‌గా వెళ్లిపోతాడని అంతా భావించారు.

    అయితే హైపర్ ఆది మాత్రం జబర్దస్త్ ను వదలడం లేదని తేల్చేసాడు. దీంతో భవిష్యత్తులో మెగా ఫ్యామిలీతో దూరం ఏర్పడే అవకాశం కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు జనసేనతో సైతం హైపర్ ఆది రిలేషన్ మీద ఇది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని సోషల్ మీడియా నెటిజన్లు భావిస్తున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Hyper Aadi, Hyper Adi, Jabardasth, Jabardasth comedy show, Jabardasth comey show, Nagababu

    తదుపరి వార్తలు