Home /News /movies /

HYPER AADI AND ANASUYA VIRAL PERFORMANCE IN OMKAR SIXTH SENSE 4 SHOW NR

Hyper Aadi - Anasuya: వామ్మో.. ఆ షోలో హైపర్ అది, అనసూయ రచ్చ మాములుగా లేదుగా!

Hyper aadi anasuya

Hyper aadi anasuya

Hyper Aadi - Anasuya: బుల్లితెరలో ఎన్నో ఎంటర్టైన్మెంట్, రియాలిటీ షోలు ప్రసారమవుతున్నాయి. ప్రస్తుతం బుల్లితెర లో ఈ షోల హవానే నడుస్తోంది. ఎంతో మంది సెలబ్రెటీలను గెస్ట్ లుగా ఆహ్వానించి తెగ సందడి చేయిస్తుంటారు.

    Hyper Aadi - Anasuya: బుల్లితెరలో ఎన్నో ఎంటర్టైన్మెంట్, రియాలిటీ షోలు ప్రసారమవుతున్నాయి. ప్రస్తుతం బుల్లితెర లో ఈ షోల హవానే నడుస్తోంది. ఎంతో మంది సెలబ్రెటీలను గెస్ట్ లుగా ఆహ్వానించి తెగ సందడి చేయిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది.. యాంకర్ అనసూయ తో కలిసి ఓ షో లో తెగ హల్ చల్ చేశాడు.

    నిజానికి అనసూయ, హైపర్ ఆది జబర్దస్త్ లో చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అనసూయపై పంచ్ వేయనిది తన స్కిట్ ను మాత్రం కంప్లీట్ చేయడు హైపర్ ఆది. ప్రతి ఒక్క విషయంలో అనసూయను బాగా ట్రోల్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు తనతో డాన్స్ చేస్తూ తెగ అదరగొడతాడు. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరూ ఓంకార్ చేయనున్న రియాలిటీ షోలో పాల్గొన్నారు.

    ప్రస్తుతం ఓంకార్ సిక్స్త్సెన్స్ సీజన్ 4 ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు సీజన్ లను పూర్తి చేసిన ఓంకార్ మళ్లీ సీజన్ ఫోర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక దీంతో మొదటి ఎపిసోడ్ క్రేజీ సెలబ్రెటీలతో చెయ్యాలని అనుకోగా దీంతో అనసూయ, హైపర్ ఆది లను ఆహ్వానించాడు. ఇక దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో హైపర్ ఆది నగ్నం గా కనిపిస్తూ అందరికీ షాక్ అయ్యేలా చేశాడు.

    ఇందులో అనసూయ ఓ ఛాలెంజ్ తో గేమ్ లో ఉండగా ఆది తన ఛాలెంజ్ లో ఓడిపోయినట్టుగా అనిపించడంతో అందులో గేమ్ లో భాగంగా పాల్గొనే లేడీ తో తన బట్టలను విప్పేలా చేశారు. పక్కనే ఉన్న అనసూయ ఆది ని చూసి తెగ నవ్వుతుంది. ఇక ఆది.. ఆది కేశవరెడ్డిలలా వస్తే అర్జున్ రెడ్డి ల చేశారంటూ కౌంటర్ వేస్తాడు. ఇక మొత్తానికి ఈ ప్రోమో లో కాస్త గేమ్ ఆసక్తిగా కనిపించడంతో ఈ షో శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Anasuya Bharadwaj, Extra jabardasth, Hyper Aadi, Jabardasth, Ohmkar, Rashmi gautham, Sixth sense 4, Star Maa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు