Hyper Aadi: ఛీఛీ.. అమ్మాయిలతో అలాంటి పనులు చేస్తున్న హైపర్ ఆది.. అనసూయ కూడా?

Hyper Aadi

Hyper Aadi: బుల్లితెర లో ప్రసారమవుతున్న జబర్దస్త్ తో స్టార్ కమెడియన్ గా నిలిచిన హైపర్ ఆది గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. తన కామెడీ పంచ్ లతో ఓ రేంజ్ లో గుర్తింపు అందుకున్నాడు.

  • Share this:
    Hyper Aadi: బుల్లితెర లో ప్రసారమవుతున్న జబర్దస్త్ తో స్టార్ కమెడియన్ గా నిలిచిన హైపర్ ఆది గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. తన కామెడీ పంచ్ లతో ఓ రేంజ్ లో గుర్తింపు అందుకున్నాడు. వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించాడు. ఇక విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నాడు హైపర్ ఆది. తన స్కిట్ లో భాగంగా డైలాగ్స్ తో బాగా రెచ్చిపోతూ.. ప్రతి ఒక్కరిని ఉద్దేశిస్తూ పంచులు వేస్తూ ఉంటాడు.

    జబర్దస్త్ లోనే కాకుండా పలు షో లలో కూడా బాగా బిజీ గా మారాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో లో కూడా టీమ్ లీడర్ గా చేస్తున్నాడు. పలు ఈవెంట్లలో కూడా తన డైలాగ్స్ తో బాగా సందడి చేస్తుంటాడు. ఇక జబర్దస్త్ లో అనసూయను మాత్రం ట్రోల్ చేయకుండా ఉండడు. పైగా తనతో డాన్స్ స్టెప్పులతో బాగా రెచ్చిపోతుంటాడు. ఇదిలా ఉంటే అమ్మాయిలతో అలాంటి పనులు అంటూ రచ్చ చేశాడు హైపర్ ఆది.

    జబర్దస్త్ సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదల కాగా అందులో తన స్కిట్టు తో తెగ నవ్వించాడు. ప్రతిసారి ఆది తన స్కిట్ లో ఎవర్నో ఒకర్ని గెస్ట్ గా పరిచయం చేస్తూ ఉంటాడు. తాజాగా మరో సెలబ్రిటీ ని గెస్ట్ గా ఆహ్వానించగా.. అమ్మాయిల పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కడుపు పండాలని భార్య అనగానే వెంటనే ఆది గోరింటాకు పెట్టుకో అంటూ పంచ్ వేశాడు.

    ఇక ఆమె పిల్లల గురించి మాట్లాడుతూ.. ఏమైందండీ ఏమైనా లోపం అని అనగా.. వెంటనే హైపర్ ఆది ఏమి చేయక పోతే లోపం అంటారు. ఏమైనా చేస్తే స్కిట్ కోసం పిలిచి ఇలా చేస్తారా అంటారు. ఇప్పుడు ఏం చేయాలి అని మళ్లీ పంచ్ వేయగా.. అంతలోనే అనసూయ స్కిట్ కోసం వచ్చి అమ్మాయిలు అందరితో చేసేశావా అన్నీ డబుల్ మీనింగ్ డైలాగ్ తో కామెంట్ చేసింది. ఇక ఆది హే ఏంటండీ ఈమె కూడా ఇలాగే అంటుంది అంటూ సిగ్గు పడతాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.
    Published by:Navya Reddy
    First published: