Home /News /movies /

HYDERABAD SHOOTER ASGHAR ALI WHO SHOT DEAD AVNI ISSUES NOTICE AGAINST MAKERS OF SHERNI FOR THIS REASON SRD

Sherni : నిజాల్ని వక్రీకరించారు.. విద్యాబాలన్ షేర్నీ చిత్ర బృందానికి హైదరాబాద్ షూటర్ అస్గర్ నోటీసులు..

Photo Credit : IANS

Photo Credit : IANS

Sherni : జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న విద్యాబాలన్ గత యేడాది మేథమెటీషియన్ శకుంతల దేవి బయోపిక్ లో నటించారు. అది ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ యేడాది కూడా డాక్యూ డ్రామాను తలపించే ‘షేర్నీ’ మూవీలో ఆమె యాక్ట్ చేశారు. అయితే, ఈ మూవీ యూనిట్ కి నోటీసులు ఇచ్చారు షూటర్ అస్గర్. ఆయన నోటీసులు ఇవ్వడానికి కారణమేంటి..?

ఇంకా చదవండి ...
  విద్యాబాలన్‌ నాయికగా ఈ మధ్య అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన "షేర్నీ" అటవీ నేపథ్యంలోని చిత్రాల్ని ఇష్టపడేవారిని అమితంగా ఆకర్షించింది. ప్రాణాంతకమైన ఒక ఆడ పులిని సజీవంగా పట్టుకోవడానికి... ఒక బృందంతో మహిళా అటవీ అధికారి చేసే సాహసోపేతమైన ప్రయత్నం, ఆ క్రమంలో ఎదురయ్యే అవరోధాలు ఈ చిత్రంలోని ప్రధానాంశం. బాలీవుడ్ అగ్రకథానాయక విద్యాబాలన్ నటించిన షేర్నీ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, చిత్ర యూనిట్‌కు ఊహించని పరిణామాం ఎదురైంది. పులి అవనిని చంపిన షూటర్ అస్గర్ అలీ ఈ సినిమా దర్శక నిర్మాతలకు లీగల్ నోటీసులు ఇచ్చారు. "షేర్ని" సినిమాలో వాస్తవాలు వక్రీకరించారని ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని యావత్మల్‌లో ‘‘అవని’’ అనే పులిని అస్గర్ 2018లో కాల్చి చంపాడు. ఈ సంఘటన ఆధారంగా షెర్నీని నిర్మించారు. సదరు నోటీసులో అస్గర్ ఇలా అన్నారు. షేర్నీ చిత్రం.. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తుకు ఆటంకం కలిగించడంతో పాటు తమ ప్రతిష్టకు, హక్కులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. షఫత్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. ఈ కథ కల్పితమని చిత్ర యూనిట్ చెబుతున్నప్పటికీ వాస్తవాలను వక్రీకరించారు. షెర్నీ చిత్రం ద్వారా కోర్టులో దాఖలైన పిటిషన్‌ను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

  పులి బారి నుంచి ప్రజలను రక్షించడానికి అస్గర్ దానిని నాలుగు మీటర్ల దూరం నుంచి కాల్చి చంపాడని షఫత్ అలీఖాన్ తెలిపారు. అవని 14 మందిని చంపిందని.. తాను, అస్గర్ ప్రభుత్వ ఆహ్వానం మేరకే అక్కడికి వెళ్లామని ఆయన వెల్లడించారు. షూటింగ్ ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నాడు కోర్టులు కూడా నిరాకరించని విషయాన్ని షఫత్ గుర్తుచేశారు. అయినప్పటికి తమను కించపరచడానికి, జంతు హక్కుల కార్యకర్తల ఆదేశాల మేరకే ఈ చిత్రం నిర్మించారని ఆయన ఆరోపించారు.

  అస్గర్ నోటీసుపై స్పందించారు షెర్ని చిత్ర తయారీదారు అబుండాంటియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. అస్గర్, అతని తండ్రి ఆరోపణలను ఖండించారు. షెర్నీ కల్పితమైన కథ అని.. ఇందులో అస్గర్, అతని తండ్రి షఫత్ అలీ ఖాన్‌ను తాము ఏ విధంగానూ చిత్రీకరించలేదని స్పష్టం చేశారు. షెర్నిలో అస్గర్, అతని తండ్రితో పోలికలు ఉన్నాయని నిరూపించడానికి వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది.

  జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న విద్యాబాలన్ గత యేడాది మేథమెటీషియన్ శకుంతల దేవి బయోపిక్ లో నటించారు. అది ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ యేడాది కూడా డాక్యూ డ్రామాను తలపించే ‘షేర్నీ’ మూవీలో ఆమె యాక్ట్ చేశారు. గత శుక్రవారం నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 2018లో మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో అవని (టి 1) అనే ఆడపులి దాదాపు పదమూడు మందిపై దాడి చేసి చంపేసింది. ఆ మ్యాన్ ఈటర్ ను కొందరు వేటగాళ్ళు హతమార్చారు. దానిపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, సజీవంగా పట్టుకుని అడవిలో వదిలే ప్రయత్నం చేయకుండా క్రూరంగా చంపేశారని, అసలు అది మ్యాన్ ఈటర్ అనడానికి ఆధారాలు లేవని కొందరు వన్యప్రాణ సంరక్షకులు ఆందోళన చేశారు, కోర్టు తలుపులూ తట్టారు. ఈ అంశాలనే ఆధారం చేసుకుని కోర్టు డ్రామా లేకుండా దర్శకుడు అమిత్ మసూర్కర్ ‘షేర్నీ’ సినిమాను తీశారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Hyderabad, Tiger, Vidya Balan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు