పూజా హెగ్డే.. నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు. ఈ భామ టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది. అల్లు అర్జున్ సరసన 'డీజే' లోహాట్‌గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత'లో క్యూట్‌గా మైమరిపించింది. తర్వాత మహేష్ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకుంది. తాజాగా బన్ని సరసన అలవైకంఠపురములో నటించి అదిరిపోయే హిట్ అందుకుంది. అది అలా ఉంటే ఈ సినిమాలో ఓ డైలాగ్‌ను హైదరాబాద్ పోలీస్ ఓ మంచి పనికోసం ఉపయోగించింది. ఓ సందర్భంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే.. ఓ బిజినెస్ డీల్ కోసం మరో నటుడు బ్రహ్మాజీని కలవడం జరుగుతుంది. అక్కడ బ్రహ్మాజీ డిమాండ్ చేస్తూ.. పూజా హెగ్డే నిర్వహిస్తున్న ఆ బిజినెస్‌ను తనకు ఇవ్వమంటాడు. అయితే దానికి మాత్రం పూజా హెగ్డే నో అంటోంది. ఆ సీన్’ను తీసుకుని అమ్మాయిలు ఏదైనా విషయంలో నో అన్నారంటే దాని అర్థం నో అని మాత్రమేనని.. ఇంకోటి కాదనే అర్థం వచ్చేలా పోలీసులు ఆ సీన్‌ను కట్ చేసి వాడుకుంటున్నారు. ఇక్కడ మహిళలు ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్‌తో లేదా స్వంత భర్తతో కానీ సెక్స్‌కు నో చెబితే దాని అర్థం నో అని మాత్రమే అని.. అంతేకానీ అవునని అర్థం కాదని మీనింగ్ వచ్చేలా వాడారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#RespectWomen #StopCrimesAgainstWomen
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) November 17, 2020
Respect women not because she is a woman but because you are a #Gentleman pic.twitter.com/kmlOOyNT7t
ఇక ఇదే అంశాన్ని హిందీలో అమితాబ్ ప్రధాన పాత్రలో తాప్సీ మరో కీలకపాత్రలో వచ్చిన పింక్‌లో వివరంగా చర్చించిన విషయం తెలిసిందే. అదే సినిమాను ఇప్పుడు తెలుగులో వకీల్ సాబ్ అనే పేరుతో తీస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ పోషించిన ఆ లాయర్ పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. ఇక పూజా హెగ్డే ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈ భామ ప్రస్తుతం అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ను జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నా ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక పూజా ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా ముగింపు దశలో వుంది. పిరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్ ను రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో పూజ హెగ్డే మ్యూజిక్ టీచర్ గా కనిపించనుందట. రాధేశ్యామ్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషాల్లో విడుదలకానుంది. ఈ సినిమాలే కాకుండా తెలుగులో మరో అవకాశాన్ని అందిపుచ్చుకుంది పూజా. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తోన్న ఓ చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఫైనల్ చేశారట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde