చెక్ బౌన్స్ కేసులో తాను నిన్న జూబ్లీ హిల్స్ పోలీసులు బండ్ల గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. మరో సినీ నిర్మాత, వైసీపీ పార్టీ నేత పీవీపీని బెదిరించిన కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. ఈ విషయమై బండ్ల గణేష్ స్వయంగా స్పందించి.. తననెవరూ అరెస్ట్ చేయలేదని..పోలీసులు పిలిస్తే.,. విచారణకు వెళ్లానని క్లారిటీ ఇచ్చాడు. 2014 అక్టోబర్ 1న కడపకు చెందిన మహేష్ అనే వ్యాపారి వద్ద గణేష్.. రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బు ఇవ్వకుండా బండ్ల గణేష్ ముప్పతిప్పులు పెట్టినట్టు సమాచారం. ఇక బండ్ల గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. తాజాగా పోలీసులు బండ్ల గణేష్‌పై కేసు నమోదు చేసారు.
ఐతే.. కోర్డు కూడా బండ్ల గణేష్‌కు హాజరు కమ్మని చెప్పినా.. ఇప్పటి వరకు హాజరు కాలేదు. బండ్ల గణేష్‌పై కడప స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అఫెన్సెస్ న్యాయమూర్తి సెప్టెంబర్ 18న అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. పోలీసులు అతడిని కడప జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, PVP, Telugu Cinema, Tollywood