Home /News /movies /

HYDERABAD POLICE LATHI CHARGE ON NTR FANS AT HIS HOUSE SB

Jr NTR: ఎన్టీఆర్ ఇంటి ముందు ఫ్యాన్స్ గొడవ.. పోలీసుల లాఠీ ఛార్జ్

ఎన్టీఆర్ ఇంటి ముందు ఫ్యాన్స్ గొడవ

ఎన్టీఆర్ ఇంటి ముందు ఫ్యాన్స్ గొడవ

తారక్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. అయితే ఆయన ఇంటి ముందు కొందరు గొడవకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నంలో లాఠీ ఛార్జ్ చేశారు.

    జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) పుట్టినరోజు ఇవాళ. దీంతో ఆయన అభిమానులు హల్ చల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు.వాట్సాప్ స్టేటస్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా సోషల్ మీడియా( Social Media)అంతా ఎన్టీఆర్ ఏలేస్తున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే అంటే ఆయన అభిమానులకు పండగ రోజు. సన్నిహితులు ముద్దుగా పిలుచుకొనే... తారక్ ఇవాళ 39వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈసందర్భంగా తమ అభిమాన హీరో, యంగ్ టైగర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు. దీంతో.. ఎన్టీఆర్‌(NTR) పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయన ఇంటి దగ్గర హడావుడి చేశారు.

    ఎన్టీఆర్ ఇంటికి భారీగా అభిమానులు(Ntr Fans) తరలిరావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. అయితే ఎన్టీఆర్ ఇంటి ముందే కేక్‌ కట్‌ చేసే సమయంలో అభిమానుల మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. ఫ్యాన్స్ అల్లరి శ్రుతి మించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు అల్లరి ఎక్కువ కావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి అభిమానులను చెదరగొట్టారు. అయితే అర్థరాత్రే కొందరు అభిమానులు తారక్ ఇంటివద్దకు చేరుకొని బాణాసంచ కాల్చి హడావుడి చేశారు. మాస్ హీరో మాస్ ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్స్ అంటూ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు.


    మరోవైపు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ తన్ నెక్స్ట్ సినిమా తో అంటూ అధికారికంగా ప్రకటిస్తూ.. సినిమా కు సంబంధించిన కీలక అప్డేట్ ను రిలీజ్ చేశారు. తారక్ కెరీర్ లో 30వ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి # NTR 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టి కొరటాల మాసివ్ వీడియోని రిలీజ్ చేశారు. ఆల్ రెడీ తారక్- కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చి బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు సంధర్భంగా అభిమానులకు కొన్ని గంటల ముందే తారక్ బర్తడే ట్రీట్ ను అందించాడు. #NTR30 సినిమా కి సంబంధించిన డైలాగ్ ని రిలీజ్ చేసారు.

    ఈ సినిమా పవర్‌ఫుల్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్నట్టు ఈ స్పెషల్‌ వీడియోను చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ఓ స్థాయిలో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తాజా గా రిలీజ్ చేసిన వీడియో తారక్ చెప్పే డైలాగ్ యువత ని బాగా ఆకట్టుకుంటుంది. ‘అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి దమ్ము ఉండకూడదు అని..అప్పుడు ఆ టైంలో భయానికి తెలియాలి..తాను రావాల్సిన సమయం ఆసన్నమైంది' అంటూ మాస్ బేస్ వాయిస్‌తో తారక్ చెప్పే డైలాగ్స్ వింటుంటే..  గూస్ బంప్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఆ డైలాగ్స్ కి అనిరుధ్ మాస్ మ్యూజిక్ అందించారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Hyderabad, Jr ntr, RRR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు