టాలీవుడ్ స్టార్స్‌కు.. హైదరాబాద్ పోలీసుల షాక్ : అల్లు శిరీష్, పూజా హెగ్డేలకు నోటీసులు

జనాలకు అప్పులు ఇచ్చి..ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో వడ్డీలను వసూలు చేయడం. ఒకవేళా అప్పుతీసుకొని ఇవ్వలేక పోతే వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసే మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యవస్థను తెలుగు రాష్ట్రాలు నిషేదించిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: June 29, 2019, 8:09 PM IST
టాలీవుడ్ స్టార్స్‌కు.. హైదరాబాద్ పోలీసుల షాక్ : అల్లు శిరీష్, పూజా హెగ్డేలకు నోటీసులు
అల్లు శిరీష్, ఫూజ హెగ్డే Photo : Twitter
news18-telugu
Updated: June 29, 2019, 8:09 PM IST
జనాలకు అప్పులు ఇచ్చి..ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో వడ్డీలను వసూలు చేయడం. ఒకవేళా అప్పుతీసుకొని ఇవ్వలేక పోతే వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ మల్టీ లెవల్ మార్కెటింగ్ వ్యవస్థను తెలుగు రాష్ట్రాలు నిషేదించిన సంగతి తెలిసిందే. కాగా నిషేదించిన ఈ మల్టీలెవవల్ మార్కెటింగ్ సిస్టమ్‌ను క్యూనెట్, నౌహీరా లాంటీ సంస్థలు సిక్రెట్‌గా నిర్వహిస్తున్నాయని.. ఆధారాలతో హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఈ మార్కెటింగ్‌కు సంబందించి పోలీసులకు కొన్ని విస్తూ పోయే నిజాలు తెలిసాయి. ఈ మల్టీలెవల్ మార్కెటింగ్ సిస్టమ్‌కు కొందరూ బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు అంబాసిడర్స్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతకు ముందే ఈలాంటీ కేసులో 9 మంది సెలెబ్రీటీలకు నోటీసులు ఇవ్వగా.. తాజాగా వెలుగులోకి వచ్చిన నౌహీరా కేసులో 12 మంది ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.

షారుఖ్, అల్లు శిరీష్, ఫూజ హెగ్డే Photo : Twitter


వీరిలో బాలీవుడ్‌కు చెందిన సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో పాటు..అనిల్ కపూర్, బోమన్ ఇరానీ, జాకీష్రాఫ్, వివేక్ ఒబెరాయ్..తెలుగు ఇండస్ట్రీకి చెందిన అల్లు శిరీష్, పూజా హెగ్డేలు కూడా ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. దీంతో వీరికి నోటీసులు జారి చేశారు. ఈ నోటీసుల‌కు షారూక్ మాత్ర‌మే స‌మాధానం ఇచ్చిన‌ట్లు స‌మాచారం. స‌మాధానం ఇవ్వ‌ని వారికి మ‌రోసారి నోటీసులు ఇవ్వాల‌ని పోలీసులు నిర్ణ‌యించారు.

First published: June 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...