Bigg Boss 3: వివాదాల నేపథ్యంలో నాగార్జున ఇంటి చుట్టూ భద్రతను పెంచిన పోలీసులు

Bigg Boss 3 : బిగ్ బాస్ చుట్టూ అల్లుకుంటున్న వివాదాలు.. షో నిర్వాహకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

news18-telugu
Updated: July 17, 2019, 7:08 PM IST
Bigg Boss 3: వివాదాల నేపథ్యంలో నాగార్జున ఇంటి చుట్టూ భద్రతను పెంచిన పోలీసులు
అక్కినేని నాగార్జున
news18-telugu
Updated: July 17, 2019, 7:08 PM IST
Bigg Boss 3 : మ‌రో 4 రోజుల్లో బిగ్ బాస్ షో మొదలు కానున్న సంగతి తెలిసిందే. అది అలా ఉంటే బిగ్ బాస్ చుట్టూ అల్లుకుంటున్న వివాదాలు.. షో నిర్వాహకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శ్వేతా రెడ్డి, గాయ‌త్రి గుప్తా లాంటి వాళ్ల కేసుల పుణ్య‌మా అని చాలా వివాదాల‌కు బిగ్ బాస్ షో కేంద్ర‌బిందువు అవుతోంది. తాజాగా ఓయూ విధ్యార్థులు కూడా దీనిపై క‌న్నెర్ర చేసారు. దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఈ షోపై కేసు కూడా ఫైల్ చేసాడు. ఈయ‌న‌కు ఓయూ విద్యార్థులు కూడా తమ మద్దుతును తెలిపారు. కాగా నిర్వాహ‌కుల‌ను అరెస్ట్ చేయాల‌ని దాఖలైన పిటిష‌న్ ప‌రిశీలించిన కోర్ట్.. అలాంటివేం చేయొద్ద‌ని ఆదేశిస్తూ షో నిర్వాహకులకు కాస్త ఊర‌ట‌నిచ్చింది.. అయితే వారం రోజుల్లో కౌంట‌ర్ పిటిషన్ దాఖ‌లు చేయాల‌ని తెలిపింది.

బిగ్ బాస్ షో ప్రదర్శన వ‌ల్ల యువ‌త చెడిపోతుందంటూ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తెలంగాణ హై కోర్టును ఆశ్ర‌యించిన సంగతి తెలిసిందే. దీనికి ఓయూ విధ్యార్థుల కూడా మద్దుతు ఉండడం.. ఈ పరిస్థితుల్లో నిరసనకారులు షో హోస్ట్ నాగార్జున ఇంటితో పాటు బిగ్ బాస్ నిర్వాహక కార్యాల‌యాన్ని కూడా ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేయవచ్చన్న నేపథ్యంలో తాజాగా నాగార్జున ఇంటి చుట్టూ పోలీసులు భద్రతను పెంచారు.

First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...