Mohan Babu: మోహన్ బాబు కేసులో నలుగురు అనుమానితుల అరెస్ట్..

Mohan Babu: సినీ నటుడు మోహన్‌ బాబు ఇంటి దగ్గర కలకలం రేగింది. మోహన్‌బాబు ఇంట్లోకి ఓ గుర్తు తెలియని కారు దూసుకెళ్లింది. మిమ్మల్ని వదలమంటూ దుండగులు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 2, 2020, 8:52 PM IST
Mohan Babu: మోహన్ బాబు కేసులో నలుగురు అనుమానితుల అరెస్ట్..
మోహన్ బాబు (Mohan Babu)
  • Share this:
సినీ నటుడు మోహన్‌ బాబు ఇంటి దగ్గర కలకలం రేగింది. మోహన్‌బాబు ఇంట్లోకి ఓ గుర్తు తెలియని కారు దూసుకెళ్లింది. మిమ్మల్ని వదలమంటూ దుండగులు హెచ్చరించి వెళ్లారు. దీంతో భయానికి లోనైన మోహన్‌ బాబు కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో మోహన్‌బాబు ఇంటి వాచ్‌మెన్ అప్రమత్తంగా లేనట్లు తెలిసింది. ఏపీ 31 ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చారు. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మోహన్ బాబు కేసులో అరెస్ట్ అయిన యువకులు (Mohan Babu)
మోహన్ బాబు కేసులో అరెస్ట్ అయిన యువకులు (Mohan Babu)

మోహన్‌ బాబు ఇంటికెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చేంత అవసరం.. ఆ స్థాయి శత్రువులు ఎవరా అన్న చర్చ మొదలైంది ఇప్పుడు ఇండస్ట్రీలో. ఈ క్రమంలోనే పోలీసులు నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసారు. వాళ్ల ఫోటోలను కూడా మీడియాకు విడుదల చేసారు. రాఘవ్ బిరదార్, గౌతమ్ రావు, కొంగరి ఆనంద్, సింగరాజు అనే నలుగురు కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అందులో అందరి వయసు 30 ఏళ్ల లోపే ఉండటం గమనార్హం. అసలు వాళ్లు ఎందుకిలా చేసారనేది పోలీసులు విచారిస్తున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: August 2, 2020, 8:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading