యూ ట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిపై నటి కల్యాణి పడాల (కరాటే కల్యాణి) దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వార్త సంచలనంగా మారింది.
యూసుఫ్‌గూడ బస్తీలో ఉంటున్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటివద్దకు అనుచరులతో కలిసి వచ్చిన కల్యాణి డబ్బులు డిమాండ్ చేయగా నిరాకరించడంతో నలుగురు కలిసి కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా మరో వ్యక్తి కరాటే కళ్యాణికి వ్యతిరేకంగా పోలీసులపై ఫిర్యాదు చేశాడు. కరాటే కల్యాణితో తనకు ప్రాణభయం ఉందని బాధితుడు ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. గతేడాదిలో జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతిపై అత్యాచారం జరగగా ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫొటోలు, పేర్లు ఇతర వివరాలను అప్పట్లో కల్యాణి మీడియాకు చెప్పింది.
వెంగళరావునగర్‌లో ఉంటున్న కర్నూల్‌కు చెందిన నితేష్ అనే వ్యక్తి బాధితురాలి వివరాలను రహస్యంగా పెట్టాల్సింది పోయి మీడియాకు ఎందుకు చెప్పావంటూ కల్యాణిని ప్రశ్నించాడు. దీనిపై సీరియస్ అయిన కళ్యాణి ‘నన్ను అడగడానికి నువ్వెవరంటూ’ ఎదురు తిరగడంతో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నితేష్‌పై కోపం పెంచుకున్న కల్యాణి తనపైనే ఫిర్యాదు చేస్తావా.. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడిందని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే తాజాగా కల్యాణిపై కేసు నమోదైనట్లు విషయం తెలుసుకున్న నితేష్.. కల్యాణితో తనకు కూడా ప్రాణభయం ఉందంటూ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
యూ ట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి విషయంలో కూడా కరాటే కళ్యాణిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఫ్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ కళ్యాణి శ్రీకాంత్‌పై ఆరోపణలు చేసింది. యువతను చెడుదోవ పట్టిస్తున్నాడని, దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన తనతో పాటు నాలుగు నెలల చిన్నారిపై శ్రీకాంత్‌రెడ్డి దాడి చేశాడని కల్యాణి కూడా ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదులు చేయడంతో ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.
ఫ్రాంక్ సాకుతో అమ్మాయిల పట్ల శ్రీకాంత్ అనుచితంగా ప్రవర్తించి మహిళల గౌరవాన్ని దిబ్బ తీస్తున్నావని తలుచుకుంటే నిన్ను మూసివేస్తానని కళ్యాణి బెదిరించిందని శ్రీకాంత్ ఆరోపిస్తున్నాడు. రూ.లక్ష ఇస్తే వెళ్లిపోతామని కూడా చెప్పిందని అన్నాడు. కళ్యాణి వెంట వచ్చిన ఒకరు తనను పక్కకు తీసుకుకెళ్లి రూ.70 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా అందుకు నిరాకరించడంతో కల్యాణి అసభ్యకరంగా మాట్లాడుతూ అనుచరులతో తనపై దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు శ్రీకాంత్. మొత్తం మీద వరుస ఫిర్యాదులతో కరాటే కళ్యాణి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.