• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • HYDERABAD INFINITY GAMING STUDIO TO MAKE A VIRTUAL RAMAYANA HERE ARE THE DETAILS SR

వర్చ్యువల్ రియాల్టీలో రామాయణ గాధ.. హైదరాబాద్ కంపెనీ వినూత్న ప్రయోగం...

వర్చ్యువల్ రియాల్టీలో రామాయణ గాధ.. హైదరాబాద్ కంపెనీ వినూత్న ప్రయోగం...

వర్చువల్ రియాలిటీలో రామాయణం

ఇప్పటి వరకు ఎవరూ చేయని ప్రయోగం.. వర్చ్యువల్ రియాల్టీలో రామాయణ గాధ.. ప్రపంచంలోనే తొలిసారి హైదరాబాద్ కంపెనీ వినూత్న ప్రయోగం చేస్తోంది.

  • Share this:
    కళ్ల ముందే జరుగుతున్న ఫీలింగ్, ఇప్పటి వరకు ఎవరూ చేయని ప్రయోగం.. వర్చ్యువల్ రియాల్టీలో రామాయణ గాధ.. ప్రపంచంలోనే తొలిసారి హైదరాబాద్ కంపెనీ వినూత్న ప్రయోగం చేస్తోంది. ఏదైనా చేయాలంటే అందుకు సంకల్పం కావాలి. ఆవిష్కరణలు చేయాలన్నా... అందుకు తగిన కథనం... సందర్భం రావాలి. అలాంటి సందర్భాన్ని హైదరాబాద్ ఇన్ఫినిటీ గేమింగ్ స్టూడియో అందిపుచ్చుకుంది. అయోధ్యలో రాములోరి ఆలయం శంకుస్థాపన ముహూర్తాన. పూర్తి వర్చ్యువల్ రియాల్టీలో రామాయణాన్ని ఈ తరానికి అందించాలన్న లక్ష్యంతో ప్రయోగం చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం... రామాయణం మహాకావ్యం ... ఆ పేరు వింటేనే భక్తి భావం వెల్లువిరుస్తుంది. రామాయణం విన్నా... కన్నా.. జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది. పురాణ ఇతిహాసాల్లోని రామాయణాన్ని ఇప్పటి వరకు దేశంలో అనేక మంది కళాకారులు అనేక రకాలుగా చిత్రీకరించారు. ఇప్పటికే రామాయణంపై ఎన్నో భాషల్లో సినిమాలు, సీరియళ్లు, కథలు దర్శకనిర్మాతలు రూపొందించారు.

    రాములోరి దివ్యగాన చరిత్రను ఎన్ని సార్లు చెప్పినా... ఎంత చెప్పినా తనివి తీరదు. రామాయణం కొత్తగా ఇంకెలా ఇవ్వాలన్న ఆలోచనలోంచే వర్చ్యువల్ రియాల్టీ ఉద్భవించింది. రామాయణం మహా కావ్యాన్ని ఇంకా కొత్తగా ఇవ్వాలన్న తలంపుతో సరికొత్త ప్రయోగం చేస్తోంది హైదరాబాద్ లోని ఇన్ఫినిటీ గేమింగ్ స్టూడియో. దేశంలోని అన్ని భాషల్లో వర్చ్యువల్ రియాల్టీలో ఈ తరానికి సరికొత్త అనభూతి కలిగించాలన్న ఉద్దేశంతో ఇన్ఫినిటీ గేమింగ్ స్టూడియో సంస్థ విశిష్ట ప్రయోగం చేస్తోంది. అదే 360 వర్చ్యువల్ రియాల్టీలో సీతారాముల కథ. రామాయణాన్ని ఈ తరానికి కళ్లకు కట్టినట్టు చూపించాలని లక్ష్యంతోనే 360 వర్చ్యువల్ రియాల్టీ ఆలోచన చేసినట్టు కంపెనీ చెబుతోంది.

    ఇందుకు మెరికల్లాంటి 40 మంది యువతను సిద్ధం చేసి ఏడాదిగా శిక్షణ సైతం ఇచ్చిందట. రామాయణం వర్చ్యువల్ రియాల్టీలో ఏడాదిగా ఒక యజ్ఞంలో శిక్షణ సాగించినట్టు కంపెనీ చెబుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణం మన కళ్ల ముందు రామాయణంలోని పాత్రలన్నీ మెదలుతాయ్. 3డీకి మించి ఈ టెక్నాలజీ మనకు మరో కొత్త అనుభూతిని కలిగిస్తుంది. హైదరాబాద్‌కు చెందిన ఇన్ఫినిటీ గేమింగ్ స్టూడియో సంస్థకు చెందిన అధికారులు మాట్లాడుతూ.. ఇప్పటికే ఐటీ హబ్ గా పేరుగాంచిన హైదరాబాద్ ను వర్చ్యువల్ రియాల్టీకి కేంద్ర స్థానంగా మారే అవకాశం ఉందని పేర్కోంటున్నారు. ప్రపంచంలో ఎవరూ కూడా వర్చ్యువల్ రియాల్టీ టెక్నాలిజీ వినియోగించడం లేదని తొలిసారిగా ఈ కాన్సెప్ట్ ను పరిచయం చేస్తున్నట్టు కంపెనీ చెబుతోంది. అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ రామమందిర శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా రామాయణం వర్చ్యువల్ ట్రయిలర్ ను విడుదల చేసింది. వారు మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతిపాదన ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ శ్రీకారం చుట్టలేదని... ఇది భాగ్యనగరానికే కీర్తి పతాక అని చెప్పారు. ఎంతో మంది చరిత్రకారులతో దీనిపై చర్చించి... ఎలాంటి వివాదాలకు తావులేకుండా వర్చ్యువల్ రియాల్టీలో నిర్మాణం సాగిస్తున్నామన్నారు. త్వరలోనే మొదటి భాగాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని... ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు