హైదరాబాద్‌లో సంచలనం రేపిన పేకాట కేసు (Gambling Case) కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య (tollywood actor Naga shourya)తండ్రి రవీంద్ర ప్రసాద్ పోలీసుల ముందు హాజరుకానున్నారు. నార్సింగి పోలీసులు ఆయన్ను విచారించనున్నారు. నాగశౌర్య తండ్రి లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లోనే జూదం జరగడంతో.. రెంటల్ అగ్రీమెంట్ తీసుకురావాలని పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలోనే ఫాంహౌస్ రెంటల్ అగ్రిమెంట్లతో పోలీసుల విచారణకు హాజరుకానున్నారు రవీంద్రప్రసాద్. ఆయనకు తెలిసే అక్కడ గ్యాంబ్లింగ్ జరుగుతుందా? అనే కోణంలోనూ కూపీ లాగనున్నారు పోలీసులు.
నాగశౌర్య ఫ్యామిలీకి నగర శివారులోని మంచి రేవుల ప్రాంతంలో ఓ ఫాంహౌస్ (Farmhouse gambling case) ఉంది. ఐతే అది సొంతానిది కాదు. లీజుకు తీసుకున్నది. ఓ మాజీ ఐఏఎస్ అధికారి నుంచి ఐదేళ్లకు గాను ఆ ఫాంహౌస్‌ను నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ లీజుకు తీసుకున్నారు. దానిని నాగశౌర్య తన కార్యాలయంగా కూడా ఉపయోగిస్తున్నారు. అప్పుడప్పుడూ ప్రైవేట్ వ్యక్తులకు రెంట్‌కు కూడా ఇచ్చేవారు.
నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో గుత్తా సుమన్ (Gutta Suman) అనే వ్యక్తి అక్కడ పేకాటా, క్యాసినో వంటి జూదలాలను నిర్వహిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో ఆదివారం సాయంత్రం స్పెషల్ ఆపరేషన్స్ పోలీసులు ఫామ్ హౌజ్‌పై దాడులు చేశారు. పేకాటతో పాటు క్యాసినో ఆడుతున్న 30 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో రాజకీయ నేతలతో పాటు రియల్ ఎస్టేట్ ప్రముఖులు కూడా ఉన్నారు. మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయారు.
ఒకే రూట్లో మెగా హీరోలు.. ఆ తరహా పాత్రల్లో అదరగొట్టనున్న చిరంజీవి,పవన్, రామ్ చరణ్..
గుత్తా సుమన్ కుమార్ హైదరాబాద్ శివారులోని పలు ఫామ్‌హౌస్‌లను అద్దెకు తీసుకొని పేకాట స్థావరాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని కాంటాక్ట్ లిస్ట్‌లో బడా వ్యాపారులు, రాజకీయ నేతలు ఉన్నట్లు తెలిపారు. బర్త్ డే పార్టీ వేడుకల పేరిట గుత్తా సుమన్ ఒకరోజు ఫామ్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నారు. కానీ లోపల మాత్రం పేకాట ఆడించారు. ఈ కేసులో గుత్తా సుమన్ పాత్రే కీలకమని పోలీసులు నిర్ధారించారు. గతంలో పలు చోట్ల గుత్తా సుమన్‌పై కేసులు నమోదయ్యాయి. సెటిల్మెంట్లు, కబ్జాలతో ఎంతో మందిని మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి.
వయసు 20ల్లో ఉన్నపుడే పెళ్లి చేసుకున్న ఈ 14 మంది హీరోయిన్ల గురించి మీకు తెలుసా?
ఈ కేసులో నార్సింగ్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడైన గుత్తా సుమన్‌ను ఉప్పర్ పల్లి కోర్టు రెండు రోజుల కస్టడీకి అప్పగించింది. ఇవాళ, రేపు నార్సింగి పోలీసులు ఆయన ప్రశ్నించనున్నారు. అంతేకాదు గుత్తా సుమన్‌పై ఏపీలో ఉన్న కేసులపై కూడా ఆరా తీయనున్నారు. ఇప్పటికే సుమన్‌పై ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు పలు వివరాలు నార్సింగి పోలీసులకు అందజేశారు. వాటిలో బ్లాక్ మెయిల్, చీటింగ్ కేసులున్నట్లు గుర్తించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gambling, Hyderabad, Naga shourya, Tollywood