హిందీ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో స్పోర్ట్స్ జానర్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘జుండ్’ తెలిసిందే. సైరాత్తో దేశ వ్యాప్తంగా పాపులరైన నాగ్ రాజ్ మంజులే ఈ సినిమాను తెరకెక్కిసున్నాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళా... కాపీరైట్స్ వివాదం నెలకొన్నది. వివరాల్లోకి వెళితే.. స్లమ్ సాకర్ ఛాంపియన్ అఖిలేశ్ పాల్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తీసిన ఈ సినిమా కాపీరైట్స్ తన దగ్గర ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ నంది చిన్నికుమార్ మియాపూర్ 15వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అంతేకాదు ఈ సినిమా దర్శక నిర్మాత నాగరాజ్ ముంజెలే, అమితాబ్‌బచ్చన్, నెట్‌ఫ్లిక్స్, టీసిరీస్ తదితర సంస్థలను తన పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్నాడు. కోర్టు నోటీసుల మేరకు ప్రతివాదులు సైతం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తాము ఎవరి కాపీరైట్స్ హక్కులను ఉల్లంఘించలేదని.. జుండ్ సినిమాను పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమే తీశామని వారు పేర్కొన్నారు. మరోవైపు అఖిలేష్ పాల్ జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు కాపీ హక్కులను కొనుగోలు చేశానని నంది చిన్ని కుమార్ పేర్కొంటున్నారు. విజయ్ బర్సె నుంచి అఖిలేష్ జీవిత కథకు సంబంధించి హక్కులను జుండ్ చిత్ర బృందం అక్రమంగా కొనుగోలు చేసిందని నంది చిన్ని కుమార్ ఆరోపిస్తున్నాడు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న 15వ అదనపు జిల్లా జడ్జి తదుపరి ఉత్తర్వుల కోసం ఈనెల 28కి వాయిదా వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Hindi Cinema