హోమ్ /వార్తలు /సినిమా /

Sekhar Movie: జీవితా రాజశేఖర్‌కు గుడ్ న్యూస్.. శేఖర్ సినిమాపై కోర్టు కీలక తీర్పు

Sekhar Movie: జీవితా రాజశేఖర్‌కు గుడ్ న్యూస్.. శేఖర్ సినిమాపై కోర్టు కీలక తీర్పు

Shekar Photo : Twitter

Shekar Photo : Twitter

మా క్లైంట్ల కు ఇవ్వ‌ాలసిన 87లక్షల10వేల రూపాయలని కోర్టులో డిపాజిట్ చేయించాలని జడ్జిని కోరారు న్యాయవాదులు. దీనికి జీవితా రాజశేఖర్ న్యాయవాదులు ఒప్పుకుంటూ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి వచ్చే డబ్బుని డిపాజిట్ చేస్తామని చెప్పారు.

టాలీవుడ్ యాంగ్రీమెన్ రాజశేఖర్(Rajasekhar) హీరోగా నటించిన ‘శేఖర్’ (Sekhar) సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోర్టు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శన నిలిపివేశారు. అయితే తాజగా మరోసారి శేఖర్ సినిమాపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బు ఇవ్వాలని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన పిటిషన్‌ను సోమవారం నాడు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. దీంతో పాటు శేఖర్ సినిమా ప్రదర్శనకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

కొంతమంది ఉద్దేశపూర్వకంగా శేఖర్ సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించినట్లు జీవిత రాజశేఖర్‌, నిర్మాత తరపు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం వెల్లడించనున్నారు. మే 20న ‘శేఖర్’ సినిమా విడుదల కాగా ఫైనాన్షియర్ పరంధామరెడ్డి పిటిషన్ మేరకు తొలుత ప్రదర్శన నిలిపివేయాలని కోర్టు ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు హీరో రాజశేఖర్ కూడా ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టగా అది వైరల్ అయ్యింది. మరోవైపు ఈ సినిమా ప్రదర్శనలు కూడా నిలిచిపోయాయి.

ఈ క్రమంలో రాజశేఖర్ నటించిన  శేఖర్ సినిమా గురించి సోమ‌వారం కోర్టులో వాదనలు జరిగాయి. శేఖర్ సినిమా ఆగిపోవడంతో త‌మ‌కు ఎంతో నష్టం జరుగుతుందనీ, ఈసినిమా నెగటివ్ మీద ఉన్న స్టే ని ర‌ద్దు చేయాల‌ని జీవిత రాజశేఖర్ అడ్వకేట్స్ కోర్టును కోరారు. ఈ స‌మ‌యంలో పరంధామ రెడ్డి తరపున అడ్వకేట్స్ సినిమా ప్రదర్శించుకొనుటకు మాకెటువంటి అభ్యంతరం లేదని, అయితే  వచ్చే కలక్షన్లలో మా క్లైంట్ల కు ఇవ్వ‌ాలసిన 87లక్షల10వేల రూపాయలని కోర్టులో డిపాజిట్ చేయించాలని జడ్జిని కోరారు. ఈ వాద‌న‌తో జడ్జి ఏకీభవించారు. అందుకు జీవితా రాజశేఖర్ న్యాయవాదులు ఒప్పుకుంటూ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి వచ్చే డబ్బుని డిపాజిట్ చేస్తామని తెలియజేయడంతో ,రెండు రోజులలో ఆ అకౌంట్ వివరాల‌ను కోర్టుకు తెలియచేయాలని జడ్జి ఆదేశించారు. దీంతో సినిమా ప్రదర్శనకు అనుమతి లభించిన‌ట్టు అయ్యింది.

అయితే తాజాగా ఇరు వర్గాల వాదనలు విన్న సిటీ సివిల్ కోర్టు సినిమా ప్రదర్శించుకోవచ్చని తీర్పు వెల్లడించింది. దీంతో పాటు భవిష్యత్తులో ‘శేఖర్’ చిత్ర ప్రదర్శనపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వారికి తాము మద్దతుగా నిలుస్తామని హీరో రాజశేఖర్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. తమ వెన్నంటే ఉన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వివరించారు.

First published:

Tags: Dr Rajashekar, Jeevitha rajasekhar

ఉత్తమ కథలు