HYDERABAD 3 KILLED IN GACHIBOWLI TRAGIC ROAD ACCIDENT 2 JUNIOR ARTISTS AND DRIVER ALSO DIES ONE INJURED PK
Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు దుర్మరణం..
ప్రతీకాత్మకచిత్రం
Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. డిసెంబర్ 18 ఉదయం జరిగిన దారుణమైన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. అందులో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వేగంగా దూసుకెల్లిన కారు మూడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది.
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 18 ఉదయం జరిగిన దారుణమైన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. అందులో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వేగంగా దూసుకెల్లిన కారు మూడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని HCU రోడ్‌లో ఈ దారుణమైన యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. డిసెంబర్ 18 తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి డివైడర్ మధ్యలో చెట్టును డీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయపడిన వ్యక్తి పేరు సిద్ధు అని తెలుస్తుంది. అతడు కూడా జూనియర్ ఆర్టిస్టే. పైగా ఆయనతో పాటు కారులో మరో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. చనిపోయిన వాళ్లలో ఇద్దరు ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. మానస(22), మానస(21) అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. వాళ్ళతో పాటు డ్రైవర్ అబ్దులా కూడా దుర్మరణం పాలయ్యాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలపాలైన సిద్దు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.