news18-telugu
Updated: January 15, 2020, 6:21 PM IST
నాగబాబు, హైపర్ ఆది
నాగబాబు జబర్ధస్త్‌ను వీడినా... ఆయనతో తమకున్న సత్సంబంధాలు మాత్రమే యథావిధిగానే కొనసాగుతున్నాయని హైపర్ ఆది తెలిపారు. సంక్రాంతి సందర్భంగా తన సొంతూరు అయిన ప్రకాశం జిల్లా చీమకుర్తికి వచ్చిన హైపర్ ఆది... కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతిని జరుపుకున్నారు. ఒకప్పుడు తాను చదువుతున్న స్కూలు, కాలేజీకి తాను చీఫ్ గెస్ట్‌గా వెళ్లడం ఆనందంగా ఉందన్న హైపర్ ఆది... సినిమాలు, టీవీ షోలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని వివరించారు. ఇటీవల తనకు సినిమాల్లో అవకాశాలు పెరిగాయని హైపర్ ఆది ఆనందం వ్యక్తం చేశారు.
తాను వేసే పంచ్‌లు వివాదం కావడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవని ఆయన అన్నారు. తాను ఎవరినీ ఉద్దేశించి ప్రత్యేకంగా పంచ్‌లు వేయబోనని వివరించారు. తాను ఎక్కువగా కరెంట్ ఎఫైర్స్‌పై ఫోకస్ చేస్తానని తెలిపిన హైపర్ ఆది... ఆ క్రమంలోనే కొన్ని పంచ్‌లు వివాదాస్పదమవుతుంటాయని వ్యాఖ్యానించారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఏడాదికి ఒకసారే సొంతూరుకు రావడం జరుగుతోందని... ఒకసారి ఊరికి వచ్చి వెళ్లిన తరువాత కొన్ని రోజుల పాటు ఆ ఎమోషన్స్ కొనసాగుతుంటాయని తెలిపారు.
Published by:
Kishore Akkaladevi
First published:
January 15, 2020, 6:21 PM IST