జబర్ధస్త్‌లో తాను నిలదొక్కుకోవడమే కాకుండా తన టీమ్‌లో అనేక కొత్తమందికి ఛాన్స్ ఇచ్చాడు హైపర్ ఆది. వారికి కూడా జబర్ధస్త్‌లో క్రేజ్ రావడంలో ఆదిదే కీలక పాత్ర. తన టీమ్‌లోని ఇతర సభ్యులకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన హైపర్ ఆదికి ఇటీవల దొరబాబు, పరదేశి అరెస్ట్ వ్యవహారం కొంత ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపించింది. పోలీసుల రైడింగ్‌లో దొరికిపోయిన దొరబాబు, పరదేశిలు మళ్లీ జబర్ధస్త్‌లో కంటిన్యూ అవుతారా ? లేక హైపర్ ఆది వారిని పక్కనపెడతారా ? అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఇలాంటి గాసిప్స్‌కు చెక్ పెట్టిన హైపర్ ఆది... దొరబాబు, పరదేశిలు తన టీమ్‌లోనే కొనసాగుతారని ఇటీవల చేసిన స్కిట్ ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు.
అయితే ఇదే సందర్భంలో దొరబాబు విషయంలో హైపర్ ఆది మరో కీలక నిర్ణయం తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. సాధారణంగా దొరబాబును తన స్కిట్లో రొమాంటిక్ వ్యక్తిగా చూపించే హైపర్ ఆది... ఇకపై అతడి విషయంలో ఆ రకమైన సెటైర్లు, పంచ్‌లు తగ్గించాలని నిర్ణయించుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే వీరి లాస్ట్ ఎపిసోడ్లో దొరబాబుపై ఆది అలాంటి పంచ్‌లు వేయలేదని పలువురు భావిస్తున్నారు. దొరబాబు ద్వారా కామెడీని పండించేందుకు హైపర్ ఆది అతడి చుట్టూ ఓ కొత్త ట్రాక్‌ను క్రియేట్ చేసే అవకాశం లేకపోలేదనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి దొరబాబును జబర్ధస్త్‌లో హైపర్ ఆది మళ్లీ ఏ విధంగా పాపులర్ చేస్తాడనే అంశంపై ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyper Adi, Jabardasth