‘హుషారు’ ప్రివ్యూ.. కడుపు మండింది.. బీరు పొంగింది..
కొన్ని సినిమాలు మొదలైనపుడు కానీ.. షూటింగ్ జరుపుకుంటున్నపుడు కానీ తెలియవు. అందులో కొత్తవాళ్లు ఉండటంతో ఎవరూ పట్టించుకోరు. కానీ ఈ మధ్య అలా అంచనాలు లేకుండా వస్తున్న చిన్న సినిమాలే సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు హర్ష కన్నెగంటి కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన ‘హుషారు’ సినిమా డిసెంబర్ 14న విడుదలవుతుంది.

హుషారు మూవీ పోస్టర్
- News18 Telugu
- Last Updated: December 13, 2018, 3:19 PM IST
కొన్ని సినిమాలు మొదలైనపుడు కానీ.. షూటింగ్ జరుపుకుంటున్నపుడు కానీ తెలియవు. అందులో కొత్తవాళ్లు ఉండటంతో ఎవరూ పట్టించుకోరు. కానీ ఈ మధ్య అలా అంచనాలు లేకుండా వస్తున్న చిన్న సినిమాలే సంచలనం సృష్టిస్తున్నాయి. "అర్జున్ రెడ్డి" ఏ ముహూర్తంలో వచ్చిందో కానీ అప్పట్నుంచీ చిన్న సినిమాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు శ్రీ హర్ష కొనగంటి కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన ‘హుషారు’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 14న విడుదలవుతుంది. ఉన్న ఈ చిన్న జీవితాన్ని ఎంత కలర్ ఫుల్‌గా మార్చుకోవచ్చు అనేది ఈ చిత్ర కథ.

ముందు చిన్న సినిమాగానే మొదలైనా కూడా ఇప్పుడు ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా కుర్రాళ్లను టార్గెట్ చేస్తూ వస్తున్న సినిమాపై ట్రైలర్ ఆసక్తి పెంచేసింది. పైగా పాటలు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అసలే ఇప్పుడు చిన్న సినిమాలు సైలెంట్‌గా వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. దాంతో హుషారు సినిమాను కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదు. అంతా కొత్త కుర్రాళ్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు హర్ష. "అర్జున్ రెడ్డి" ఫేమ్ రాధాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విజయ్ వర్ధన్ కావూరి ఎడిటింగ్ చేస్తున్నాడు.
కుర్ర తనంలో చేసే ప్రతీ చిలిపి పని ఇందులో చూపించాడు దర్శకుడు. స్నేహంలో ఉండే అందమైన మూవెంట్స్ ఈ చిత్రంలో చూపిస్తున్నాడు దర్శకుడు శ్రీహర్ష. ఉన్న చిన్న జీవితంలో కష్టాలు కన్నీరు కాదు చివరికి ఇక్కడ్నుంచి తీసుకెళ్లేది కేవలం మంచి జ్ఞాపకాలు మాత్రమే అని ఈ చిత్రంలో చూపిస్తున్నాడు దర్శకుడు శ్రీహర్ష. ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. ఇదే సినిమా ప్రధాన కాన్సెప్ట్ కూడా. ట్రైలర్లో బీర్ తయారీ అంటూ హైలైట్ చేసినా కూడా లోపల కాన్సెప్ట్ మాత్రం జీవితం గురించి చెప్పబోతున్నాడు దర్శకుడు. యూత్ మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుందని ధీమాగా చెబుతున్నాడు దర్శకుడు. రాహుల్ రామకృష్ణ కామెడీ ట్రైలర్లో బాగా హైలైట్ అయింది. తెలంగాణ స్లాంగ్ ఆకట్టుకుంటుంది. మరి ప్రేక్షకులకి కూడా ఈ చిత్రం హుషారు ఎక్కిస్తుందో లేదో చూడాలిక..!

షాలిని ఇది నీకు తగునా.. అంటూ తలలు పట్టుకుంటున్న టాలీవుడ్ నిర్మాతలు..
అర్జున్ రెడ్డి చూసి హత్య చేసాడంట.. సారీ చెప్పిన సందీప్ రెడ్డి వంగా..
టాలీవుడ్లో ఆ హీరో అంటే క్రష్... సీక్రేట్ చెప్పేసిన రకుల్
Bigg Boss Telugu 3: బిగ్ బాస్ నుంచి అలీరెజా ఎలిమినేషన్‌కు విజయ్ దేవరకొండ కారణమా...?
బంపర్ ఆఫర్ కొట్టేసిన అర్జున్ రెడ్డి భామ.. రణ్వీర్ సింగ్‌తో.. మూడు సినిమాలు
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంట్లో విషాదం..

Loading...