రష్మిక మందన్నకు కిర్రాక్ షాకిచ్చిన మాజీ ప్రియుడు..

Rashmika Mandanna: రష్మిక మందన్నకు ప్రస్తుతం తెలుగులో చాలా క్రేజ్ ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోలతో నటిస్తూ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 25, 2020, 7:52 PM IST
రష్మిక మందన్నకు కిర్రాక్ షాకిచ్చిన మాజీ ప్రియుడు..
రష్మిక మందన్న (Instagram/Photo)
  • Share this:
రష్మిక మందన్నకు ప్రస్తుతం తెలుగులో చాలా క్రేజ్ ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోలతో నటిస్తూ కోటి తారగా మారిపోయింది. ఇదిలా ఉంటే కన్నడలో ఈమె స్టార్ కావడానికి హెల్ప్ అయిన సినిమా కిరిక్ పార్టీ. ఈ సినిమాతోనే అందరికీ పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. కిరిక్ పార్టీలో నటించే సమయంలోనే రక్షిత్ శెట్టికి పడిపోయింది రష్మిక. ఈ సినిమా తర్వాత ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. రెండేళ్లు గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అంతలోనే తెలుగులో ఛలో సినిమాలో నటించడం.. అది బ్లాక్ బస్టర్ కావడం జరిగిపోయాయి.

రష్మిక మందన్న రక్షిత్ శెట్టి ఎంగేజ్‌మెంట్ ఫోటోస్ (rashmika mandanna)
రష్మిక మందన్న రక్షిత్ శెట్టి ఎంగేజ్‌మెంట్ ఫోటోస్ (rashmika mandanna)


కళ్లు మూసి తెరిచేలోపు గీత గోవిందంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో నెంబర్ వన్ పీఠానికి చేరువలో ఉంది. ఊహించిన దాని కంటే కూడా ఎక్కువ ఇమేజ్ రావడంతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని పూర్తిగా సినిమాలకు కమిటైపోయింది రష్మిక. ఇక ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి కూడా కన్నడలో సినిమాలు చేసుకుంటున్నాడు.

రష్మిక మందన్న రక్షిత్ శెట్టి ఎంగేజ్‌మెంట్ ఫోటోస్ (rashmika mandanna)
రష్మిక మందన్న రక్షిత్ శెట్టి ఫోటోస్ (rashmika mandanna)
ఈ మధ్యే అతడే శ్రీమన్నారాయణతో అన్ని భాషల ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ చిత్రం ఫ్లాప్ అయింది అది వేరే విషయం. ఇదిలా ఉంటే తాజాగా రక్షిత్ శెట్టి తన బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీకి సీక్వెల్ చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్న మళ్లీ కనిపిస్తుందేమో అనుకుంటే.. ఆమెకు మాత్రం ఆఫర్ ఇవ్వకూడదని ఫిక్సైపోయాడు ఈయన. అందుకే ఈ సినిమాలో అంత కొత్తవాళ్లే కనిపిస్తారని చెప్పేసాడు రక్షిత్. మొత్తానికి తన మాజీ ప్రేయసికి గిల్లకనే గిల్లేసాడు రక్షిత్ శెట్టి.
First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు