చిరంజీవికి షాక్.. సైరాపై ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు పోలీస్ కేస్..

పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయంటే ముందు వివాదాల నుంచి తప్పించుకోవడం గగనమైపోతుంది. మొన్నటికి మొన్న వాల్మీకికి తప్పలేదు.. ఇప్పుడు సైరాకు కూడా తప్పేలా లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 21, 2019, 7:58 PM IST
చిరంజీవికి షాక్.. సైరాపై ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు పోలీస్ కేస్..
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి లైఫ్ స్టోరీ (Source: Youtube)
  • Share this:
పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయంటే ముందు వివాదాల నుంచి తప్పించుకోవడం గగనమైపోతుంది. మొన్నటికి మొన్న వాల్మీకికి తప్పలేదు.. ఇప్పుడు సైరాకు కూడా తప్పేలా లేదు. అక్టోబర్ 2న విడుదల కానున్న సైరా నరసింహారెడ్డికి ఇప్పుడు లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయి. వివాదాల్లో కూడా ఇరుక్కునేలా కనిపిస్తుంది ఈ చిత్రం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టారు.. అంతేకాదు అక్కడే ఉండి వాళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దర్శక నిర్మాతలు తమను మోసం చేసారని ఫిర్యాదు చేసారు వాళ్లు.
Huge Shock to Sye Raa Narasimha Reddy movie and family members filed case on Jubilee Hilss PS pk పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయంటే ముందు వివాదాల నుంచి తప్పించుకోవడం గగనమైపోతుంది. మొన్నటికి మొన్న వాల్మీకికి తప్పలేదు.. ఇప్పుడు సైరాకు కూడా తప్పేలా లేదు. Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy movie,Sye Raa Narasimha Reddy police case,Sye Raa Narasimha Reddy jubilee hills PS case,ram charan Sye Raa Narasimha Reddy,chiranjeevi Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy pre release event,Sye Raa Narasimha Reddy controversy,telugu cinema,ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి,సైరా నరసింహా రెడ్డి,సైరా వివాదాలు,పోలీస్ కేస్ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు,తెలుగు సినిమా
సైరా నరసింహారెడ్డి (Source: Twitter)


తమ దగ్గర నుంచి అన్ని వివరాలు.. ఆధారాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మోసం చేసారంటున్నారు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు. తమ వంశీకుడి సినిమా చేస్తూ.. తమకు ఎలాంటి ఆర్థిక సాయం చేయడం లేదని వాళ్లు కంప్లైంట్ చేసారు. దీనికి పోలీసుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మొన్నటికి మొన్న వాల్మీకి సినిమా విషయంలో కూడా ఇలాంటి వివాదాలే చుట్టుముట్టాయి. ఆ సినిమా టైటిల్ గద్దలకొండ గణేష్ అని మార్చేవరకు బోయ సంఘం పట్టుబట్టింది. ఇప్పుడు సైరా పరిస్థితి ఏం కానుందో..?
First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading