HUGE SHOCK TO RAM CHARAN VINAYA VIDHEYA RAMA DISASTROUS COLLECTIONS
రామ్ చరణ్‌కు ఊహించని షాక్ ఇచ్చిన ‘వినయ విధేయ రామ’..
వినయ విధేయ రామ పోస్టర్
రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’కు పది రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి చాలా ఏరియాల్లో చెప్పుకోదగ్గ వసూళ్లే వచ్చాయి. కొన్ని చోట్ల అయితే ఇంత దారుణమైన టాక్‌తో కూడా రికార్డులు తిరగరాసాడు రామ్ చరణ్. పది రోజుల ముగిసిన తర్వాత ఈ చిత్రం దాదాపు 60.92 కోట్ల షేర్ వసూలు చేయడం సంచలనంగా మారింది.
రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’కు 10 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి చాలా ఏరియాల్లో చెప్పుకోదగ్గ వసూళ్లే వచ్చాయి. కొన్ని చోట్ల అయితే ఇంత దారుణమైన టాక్‌తో కూడా రికార్డులు తిరగరాసాడు రామ్ చరణ్. పది రోజుల ముగిసిన తర్వాత ఈ చిత్రం దాదాపు 60.92 కోట్ల షేర్ వసూలు చేయడం సంచలనంగా మారింది. ఇంకా 37 కోట్లు వెనకబడే ఉంది ఈ చిత్రం. కానీ ఇప్పటికీ తన మాస్ ఇమేజ్‌తో రామ్ చరణ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాతో కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాడు. మరో సినిమా లేకపోవడంతో బి, సి సెంటర్లలో రప్ఫాడిస్తున్నాడు రామ్ చరణ్.
వినయ విధేయ రామ ఫైల్ ఫోటో
నైజాంలో అయితే పది రోజుల్లోనే ఈ చిత్రం 12.50 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది. ఇదివరకు చాలా సినిమాలతో ఇక్కడ 10 కోట్ల మార్క్ అందుకున్నాడు మెగా వారసుడు. ఇప్పుడు మరోసారి ‘వినయ విధేయ రామ’తో ఇదే మ్యాజిక్ చేసాడు. దిల్ రాజు ఇక్కడ ఈ చిత్రాన్ని 18 కోట్లకు కొన్నాడు. రెండో వారంలో సినిమాలేవీ లేకపోవడంతో కాస్తైనా సినిమా ఊరటనిస్తుందని నమ్ముతున్నాడు ఈయన. ఎంత ట్రై చేస్తున్నా కూడా టాక్ మరీ దారుణంగా రావడంతో కలెక్షన్ల కోసం పోరాడాల్సి వస్తుంది వినయ విధేయ రామ.
వినయ విధేయ రామ ఫైల్ ఫోటో
విడుదలైన వారం రోజుల తర్వాత పూర్తిగా డల్ అయిపోయింది ఈ చిత్రం. తొలివారం వసూళ్లు 56 కోట్లు అయితే.. ఆ తర్వాత మూడు రోజుల్లో కేవలం 4 కోట్లు మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం. ఒకవేళ దీనికి గానీ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులుతో చెడుగుడు ఆడుకునేది అంటున్నారు ట్రేడ్ పండితులు. కానీ ఏం చేస్తాం సీన్ రివర్స్ అయిపోయింది. ఫ్లాప్ సినిమాతోనే రామ్ చరణ్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సీడెడ్‌లో 11 కోట్లు.. ఉత్తరాంధ్రలో 5.50 కోట్లు.. గుంటూర్లో 6 కోట్లు.. ఈస్ట్‌లో 4.58 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఏపీ, తెలంగాణాల్లో 54.17 కోట్ల షేర్ తీసుకొచ్చింది ఈ చిత్రం 10 రోజుల్లో.
వినయ విధేయ రామలో రామ్ చరణ్, కియరా అద్వానీ
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 76 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు 54 కోట్లు వచ్చాయి. మరో 22 కోట్లు వెనకబడి ఉంది. అయితే రెండో వారం కూడా సినిమాలేవీ లేకపోవడంతో కనీసం కాస్తైనా ముందుకు వెళ్తుందని నమ్ముతున్నారు బయ్యర్లు. అయితే ఓవర్సీస్లో మాత్రం కనీసం రెండు కోట్లు రూపాయలు షేర్ కూడా తీసుకొచ్చేలా కనిపించడం లేదు ఈ చిత్రం. 8 కోట్లకు ఈ సినిమా హక్కులను అక్కడ తీసుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లోనే 60.92 కోట్ల షేర్ తీసుకువచ్చింది ‘వినయ విధేయ రామ’. మొత్తంగా 65 కోట్ల వరకు ఈ చిత్రం వసూలు చేసేలా కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. మరి చూడాలిక.. చరణ్ ఈ టాక్‌తో ఇంకెంత దూరం ప్రయాణం చేస్తాడో..?
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.