పవన్ కళ్యాణ్‌కు మెగా హీరో షాక్.. జనసేనను కాదని వైసీపీకి మద్దతు..

అదేంటి.. మెగా హీరోలతో పాటు కుటుంబం అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. పైగా ఎవరికి వాళ్లు ఓపెన్ లెటర్లు కూడా విడుదల చేస్తున్నారు కదా.. ఇలాంటి టైమ్‌లో పవన్ కళ్యాణ్‌ను కాదని మరో పార్టీకి సపోర్ట్ చేయడం అంటే చిన్న విషయం మాత్రం కాదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 6, 2019, 6:52 PM IST
పవన్ కళ్యాణ్‌కు మెగా హీరో షాక్.. జనసేనను కాదని వైసీపీకి మద్దతు..
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(ఫైల్ ఫోటో)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 6, 2019, 6:52 PM IST
అదేంటి.. మెగా హీరోలతో పాటు కుటుంబం అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. పైగా ఎవరికి వాళ్లు ఓపెన్ లెటర్లు కూడా విడుదల చేస్తున్నారు కదా.. ఇలాంటి టైమ్‌లో పవన్ కళ్యాణ్‌ను కాదని మరో పార్టీకి సపోర్ట్ చేయడం అంటే చిన్న విషయం మాత్రం కాదు. అసలు అంత ధైర్యం ఎవరికి ఉంది అనుకుంటున్నారా..? అసలే ఇప్పుడు మెగా హీరోలు సినిమాలతో పాటు పవన్ నామ స్మరణ కూడా చేస్తున్నారు. చిరంజీవి మినహ మెగా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు జనసేనకు ఓటేయండి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆయనొక్కడే సైరా షూటింగ్ కోసం జపాన్ వెళ్లాడు.
Huge Shock to Pawan Kalyan Janasena party.. Allu Arjun released open support letter to YCP Candidate pk..  అదేంటి.. మెగా హీరోలతో పాటు కుటుంబం అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. పైగా ఎవరికి వాళ్లు ఓపెన్ లెటర్లు కూడా విడుదల చేస్తున్నారు కదా.. ఇలాంటి టైమ్‌లో పవన్ కళ్యాణ్‌ను కాదని మరో పార్టీకి సపోర్ట్ చేయడం అంటే చిన్న విషయం మాత్రం కాదు. allu arjun janasena,allu arjun twitter,allu arjun pawan kalyan,allu arjun janasena support,allu arjun janasena open letter,allu arjun ysrcp candidate,allu arjun janasena campaigning,allu arjun ys jagan mohan reddy,allu arjun pawan kalyan janasena,allu arjun shilpa ravi reddy,అల్లు అర్జున్,వైసీపీకి సపోర్ట్ చేసిన అల్లు అర్జున్,శిల్పా రవి రెడ్డికి అల్లు అర్జున్ సపోర్ట్,నంద్యాలలో వైసీపీకి అల్లు అర్జున్ సపోర్ట్,అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ జనసేన
అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్

పైకి చెప్పడం లేదు కానీ చిరంజీవి కూడా తమ్ముడి పార్టీ గెలవాలని కోరుకుంటూనే ఉంటాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ మెగా హీరో మాత్రం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కాదని వైసీపీకి సపోర్ట్ చేసాడు. అలా చేస్తున్నది ఎవరో కాదు.. అల్లు అర్జున్. నమ్మడానికి కాస్త కష్టంగా.. విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే జనసేన పార్టీని కాదని వైసీపీకి సపోర్ట్ చేసాడు బన్నీ. ఇంతకీ అసలు విషయం ఏంటంటే నంద్యాల నియోజక వర్గం నుంచి బన్నీ స్నేహితుడు శిల్పా రవి రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఈయన అక్కడ్నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నాడు. ఇక అదే నియోజక వర్గం నుంచి జనసేన నుంచి సజ్జల శ్రీధర్ రెడ్డి పోటీలో ఉన్నాడు.

Huge Shock to Pawan Kalyan Janasena party.. Allu Arjun released open support letter to YCP Candidate pk..  అదేంటి.. మెగా హీరోలతో పాటు కుటుంబం అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. పైగా ఎవరికి వాళ్లు ఓపెన్ లెటర్లు కూడా విడుదల చేస్తున్నారు కదా.. ఇలాంటి టైమ్‌లో పవన్ కళ్యాణ్‌ను కాదని మరో పార్టీకి సపోర్ట్ చేయడం అంటే చిన్న విషయం మాత్రం కాదు. allu arjun janasena,allu arjun twitter,allu arjun pawan kalyan,allu arjun janasena support,allu arjun janasena open letter,allu arjun ysrcp candidate,allu arjun janasena campaigning,allu arjun ys jagan mohan reddy,allu arjun pawan kalyan janasena,allu arjun shilpa ravi reddy,అల్లు అర్జున్,వైసీపీకి సపోర్ట్ చేసిన అల్లు అర్జున్,శిల్పా రవి రెడ్డికి అల్లు అర్జున్ సపోర్ట్,నంద్యాలలో వైసీపీకి అల్లు అర్జున్ సపోర్ట్,అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ జనసేన
అల్లు అర్జున్ శిల్పా రవిరెడ్డి

జనసేన అభ్యర్థి ఉన్నా కూడా పవన్ పార్టీని కాదని.. తన స్నేహితుడు రవి రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఓపెన్ లెటర్ విడుదల చేసాడు బన్నీ. రాజకీయంగా పార్టీలు వేరైనా.. ఐడియాలజీ వేరైనా నువ్వు ఎంచుకున్న మార్గం.. తీసుకున్న నిర్ణయం విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఈయన విడుదల చేసిన ఈ లెటర్ అభిమానులకు షాక్ ఇస్తుంది. ఎంత స్నేహితుడు అయినా కూడా అలా ఓపెన్ లెటర్ విడుదల చేయడం అనేది జనసేనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు అభిమానుల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని భయపడుతున్నారు అభిమానులు. మరి దీనిపై బన్నీ ఎలా స్పందిస్తాడో చూడాలి.First published: April 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...