Home /News /movies /

HUGE SHOCK TO CHIRANJEEVI SYE RAA NARASIMHA REDDY MOVIE IN TELEVISION AND GETS LOW TRPS PK

సైరాకు ఘోర పరాభవం.. టీఆర్పీలో చిరంజీవికి నిరాశే..

సైరా పోస్టర్

సైరా పోస్టర్

చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి సినిమా ముందు నుంచి కూడా ఆయనకు నిరాశనే మిగులుస్తూ వస్తుంది. బాహుబలి తర్వాత ఆ స్థాయి సినిమా అవుతుందేమో అనుకుంటే తెలుగులో మాత్రమే మంచి వసూళ్లు..

చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి సినిమా ముందు నుంచి కూడా ఆయనకు నిరాశనే మిగులుస్తూ వస్తుంది. బాహుబలి తర్వాత ఆ స్థాయి సినిమా అవుతుందేమో అనుకుంటే తెలుగులో మాత్రమే మంచి వసూళ్లు సాధించి మిగిలిన భాషల్లో దారుణంగా నిరాశ పరిచింది సైరా. దాంతో ఓవరాల్‌గా 140 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినా కూడా చివరికి ఫ్లాప్ అనిపించుకుంది సైరా. అయితే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమా బాగానే పర్ఫార్మ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైరాను భారీగానే చూసారు ప్రేక్షకులు. శాటిలైట్ విషయానికి వస్తే భారీ రేట్‌కు జెమినీ సొంతం చేసుకుంది.

Huge shock to Chiranjeevi Sye Raa Narasimha Reddy movie in Television and gets low TRPs pk చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి సినిమా ముందు నుంచి కూడా ఆయనకు నిరాశనే మిగులుస్తూ వస్తుంది. బాహుబలి తర్వాత ఆ స్థాయి సినిమా అవుతుందేమో అనుకుంటే తెలుగులో మాత్రమే మంచి వసూళ్లు.. Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy trp ratings,Sye Raa trp ratings,chiranjeevi twitter,chiranjeevi sye raa,sye raa collections,sye raa trp ratings,tollywood,సైరా నరసింహారెడ్డా,సైరా చిరంజీవి,చిరంజీవి సైరా రేటింగ్స్,సైరా టిఆర్పీ రేటింగ్స్,తెలుగు సినిమా
సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)


గతేడాది ఈ చిత్రాన్ని విడుదలకు ముందే 25 కోట్లకు కొన్నారని వార్తలున్నాయి. అయితే తీసుకున్న 100 రోజుల తర్వాత సంక్రాంతి కానుకగా తొలిసారి సైరాను టీవీలో టెలికాస్ట్ చేసారు. జనవరి 15న ఈ సినిమాను భారీ ప్రమోషన్స్ మధ్యే తొలిసారి ప్రసారం చేసారు. అయినా కూడా రేటింగ్స్ మాత్రం తక్కువగానే వచ్చాయి. తెలుగులో తొలిసారి సైరాకు 11.8 టీఆర్పీ మాత్రమే వచ్చింది. మామూలుగా మంచి రేటింగ్ అయినా కూడా చిరు రేంజ్ కాదు ఇది. ఇక తమిళనాట గతేడాది సైరాను ప్రసారం చేసారు. అక్కడ రికార్డు స్థాయిలో 15.44 TRP సాధించింది.

Huge shock to Chiranjeevi Sye Raa Narasimha Reddy movie in Television and gets low TRPs pk చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి సినిమా ముందు నుంచి కూడా ఆయనకు నిరాశనే మిగులుస్తూ వస్తుంది. బాహుబలి తర్వాత ఆ స్థాయి సినిమా అవుతుందేమో అనుకుంటే తెలుగులో మాత్రమే మంచి వసూళ్లు.. Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy trp ratings,Sye Raa trp ratings,chiranjeevi twitter,chiranjeevi sye raa,sye raa collections,sye raa trp ratings,tollywood,సైరా నరసింహారెడ్డా,సైరా చిరంజీవి,చిరంజీవి సైరా రేటింగ్స్,సైరా టిఆర్పీ రేటింగ్స్,తెలుగు సినిమా
సైరా షూటింగ్‌లో చిరంజీవితో డైరెక్టర్ సురేందర్ రెడ్డి


ఆ తర్వాత కన్నడలో కూడా డబ్బింగ్ వర్షన్ టెలికాస్ట్ అయింది. దానికి చాలా దారుణంగా కేవలం 6.3 TRP మాత్రమే వచ్చింది. తెలుగులో ఇప్పుడు 11.8 TRP దక్కించుకుంది సైరా. TRP రేటింగ్స్ పరంగా చూసుకుంటే సైరాకు అవమానమే జరిగింది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో నెల రోజులకే సైరా ఒరిజినల్ వర్షన్ పెట్టేయడంతో రేటింగ్స్‌పై ప్రభావం పడింది. అయితే భారీ రేట్ పెట్టి కొన్న జెమినికి మాత్రం సైరా లాభాలు తీసుకురావడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. మరి చూడాలిక.. రెండోసారి సైరా రేటింగ్స్ ఎలా ఉంటాయో..?
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Sye raa, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు