చిరంజీవి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘సైరా’లో ఆ విషయంలో నిరాశ తప్పదు..

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఎలా ఉండాలో.. ఎలా ఉంటుందో అభిమానుల్లో కొన్ని లెక్కలుంటాయి. దర్శకులు కూడా వాటిని బాగా దట్టించిన తర్వాత కానీ అన్నయ్య సినిమాను సిద్ధం చేయరు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 10, 2019, 7:24 PM IST
చిరంజీవి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘సైరా’లో ఆ విషయంలో నిరాశ తప్పదు..
సైరా పోస్టర్ (Source: Twitter)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఎలా ఉండాలో.. ఎలా ఉంటుందో అభిమానుల్లో కొన్ని లెక్కలుంటాయి. దర్శకులు కూడా వాటిని బాగా దట్టించిన తర్వాత కానీ అన్నయ్య సినిమాను సిద్ధం చేయరు. ఇప్పుడు కూడా సైరా నరసింహారెడ్డి సినిమాలో అభిమానులకు కావాల్సిన అన్ని మసాలాలు అద్దిన తర్వాతే సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అయితే ఎన్ని ఉన్నా కూడా ఒక్క విషయంలో మాత్రం చిరంజీవి అభిమానులకు ఈ సారి నిరాశ తప్పదు. మెగాస్టార్ సినిమా అంటే స్టెప్స్, డాన్సులు కోరుకుంటారు వాళ్లు. అలాగే పాటలు కూడా ఉండాలనుకుంటారు. కానీ ఇప్పుడు సైరాలో అవేం కనిపించవు.
Huge shock to Chiranjeevi fans and Only 3 songs in Sye Raa Narasimha Reddy movie pk మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఎలా ఉండాలో.. ఎలా ఉంటుందో అభిమానుల్లో కొన్ని లెక్కలుంటాయి. దర్శకులు కూడా వాటిని బాగా దట్టించిన తర్వాత కానీ అన్నయ్య సినిమాను సిద్ధం చేయరు. sye raa,sye raa songs,sye raa 3 songs,sye raa chiranjeevi dance,chiranjeevi nayanthara,sye raa twitter,sye raa instagram,sye raa movie audio release,sye raa audio event,sye raa movie release date,sye raa pawan kalyan,sye raa chiranjeevi,telugu cinema,sye raa audio sept 18,సైరా,సైరా చిరంజీవి,సైరా పాటలు,సైరా పవన్ కల్యాణ్,చిరంజీవి పవన్ కల్యాణ్,సైరా ఆడియో రిలీజ్ డేట్
సైరా నరసింహారెడ్డి పోస్టర్ (Source: Twitter)

స్వాతంత్ర నేపథ్యంలో వచ్చే సినిమా కావడం.. అందులోనూ ఒక తెలుగు వీరుడి కథవ్వడం.. పీరియాడికల్ సినిమా కావడంతో యాక్షన్ సీక్వెన్సులకు చోటుంటుంది కానీ పాటలు, డాన్సులకు మాత్రం కాదు. పైగా సైరాలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయని ఇదివరకే చెప్పాడు సురేందర్ రెడ్డి. అందులోనూ ఓ పాట ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వస్తుంది. అంటే మిగిలింది.. రెండు పాటలు మాత్రమే. ఈ మూడు పాటలకు సిరివెన్నెల సాహిత్యం అందించాడు. అన్ని పాటలను తనే దగ్గరుండి మరీ రాయించుకున్నాడు నిర్మాత రామ్ చరణ్. అమిత్ త్రివేది ఈ పాటలకు ట్యూన్స్ ఇచ్చాడు.
Huge shock to Chiranjeevi fans and Only 3 songs in Sye Raa Narasimha Reddy movie pk మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఎలా ఉండాలో.. ఎలా ఉంటుందో అభిమానుల్లో కొన్ని లెక్కలుంటాయి. దర్శకులు కూడా వాటిని బాగా దట్టించిన తర్వాత కానీ అన్నయ్య సినిమాను సిద్ధం చేయరు. sye raa,sye raa songs,sye raa 3 songs,sye raa chiranjeevi dance,chiranjeevi nayanthara,sye raa twitter,sye raa instagram,sye raa movie audio release,sye raa audio event,sye raa movie release date,sye raa pawan kalyan,sye raa chiranjeevi,telugu cinema,sye raa audio sept 18,సైరా,సైరా చిరంజీవి,సైరా పాటలు,సైరా పవన్ కల్యాణ్,చిరంజీవి పవన్ కల్యాణ్,సైరా ఆడియో రిలీజ్ డేట్
సైరా టీజర్ లాంఛ్ (Source: News18 Hindi)

పీరియాడికల్ సినిమా కాబట్టి కచ్చితంగా అవసరం అనుకున్నపుడు మాత్రమే పాటలు వచ్చి.. మిగిలిన సందర్భాల్లో సన్నివేశాలతోనే వెళ్లిపోతుంటేనే బాగుంటుందని భావిస్తున్నారు విశ్లేషకులు. ఇప్పుడు సురేందర్ రెడ్డి కూడా ఇదే చేసాడు. అనవసరంగా పాటలు వస్తే సినిమాపై అభిప్రాయం మారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే కథను మాత్రమే ముందుకు తీసుకెళ్లాలని ఫిక్సైపోయాడు ఈ దర్శకుడు. అందుకే సైరాలో ఫ్యాన్స్ ఊహించే డాన్సులు, పాటలు ఉండవు.. వాటికి సిద్ధమైపోయే రావాలంటూ దర్శక నిర్మాతలు కూడా సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 2న విడుదల కానుంది ఈ చిత్రం.
Published by: Praveen Kumar Vadla
First published: September 10, 2019, 7:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading