హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan - Yash: రామ్ చరణ్, యష్ భారీ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..!

Ram Charan - Yash: రామ్ చరణ్, యష్ భారీ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..!

Huge multi starrer on cards for ram charan and yash in the direction of shankar

Huge multi starrer on cards for ram charan and yash in the direction of shankar

Ram Charan - Yash: టాలీవుడ్ మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, శాండిల్‌వుట్ రాకింగ్ స్టార్ య‌ష్‌. వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తే సెన్సేష‌న్ క్రియ‌ట్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. వీరి కాంబినేషన్‌లో శంకర్ దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ రూపొందనుందని టాక్

ఇంకా చదవండి ...

  త్వ‌ర‌లోనే ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీ రూపొంద‌నుంది. అది కూడా రెండు వేర్వేరు భాష‌ల‌కు సంబంధించిన అగ్ర క‌థానాయ‌కుల‌తో. ఇంత‌కీ ఆ అగ్ర క‌థానాయ‌కులు ఎవ‌రో కాదు. ఒక‌రేమో టాలీవుడ్ మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మరొక‌రు శాండిల్‌వుట్ రాకింగ్ స్టార్ య‌ష్‌. వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తే సెన్సేష‌న్ క్రియ‌ట్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రి ఇద్ద‌రినీ బ్యాలెన్స్‌డ్‌గా హ్యాండిల్ చేసే ద‌ర్శ‌కుడు ఎవ‌రా? అంటే ఎవ‌రో కాదు.. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ అని టాక్. ద‌క్షిణాది సినిమా రేంజ్‌ను త‌న మేకింగ్‌తో మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లిన ద‌ర్శ‌కుడు శంక‌ర్‌. ఈయ‌న సినిమా అంటే ఎలాంటి గ్రాండియ‌ర్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ స్టార్ డైరెక్ట‌ర్ ఇద్ద‌రూ ప్యాన్ ఇండియా స్టార్స్‌తో భారీ బ‌డ్జెట్ మూవీని ప్లాన్ చేశాడ‌ట‌.

  రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో య‌ష్‌, రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తే ఎలా ఉంటుందో అభిమానుల‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ చ‌ర్చ‌ల దశ‌లో ఉంద‌ని టాక్‌. అంతా ఓకే అయితే ఈ ఏడాదిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కే స‌రిపోతుంద‌ని వ‌చ్చే ఏడాదిలోనే సినిమా ట్రాక్ ఎక్కుతుంద‌ని అంటున్నారు. ఈ సినిమా స్టార్ట్ అయ్యేలోపు అటు య‌ష్ ఇటు రామ్‌చ‌ర‌ణ్ క‌మిట్ అయిన సినిమాల‌ను పూర్తి చేస్తార‌ని అంటున్నారు. 2022లో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసి 2027లో సినిమాను విడుద‌ల చేసేలా శంక‌ర్ ప్లాన్ చేసుకున్నాడ‌ట‌. చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో సినిమా ఉంటుంద‌ని టాక్‌. విఎఫ్ఎక్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంద‌ట‌.

  yash, ram charan, ram charan and yash multi starrer, director shankar, shankar next movie, shankar pan india movie, indian2, rrr, kgf chapter2, ram charan next movie, yash next movie, రామ్ చరణ్, యష్, డైరెక్టర్ శంకర్, ఇండియన్ 2
  Huge multi starrer on cards for ram charan and yash in the direction of shankar

  ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ శంక‌ర్... ఇండియ‌న్ 2 సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. వ‌చ్చే నెల‌లో ఇండియ‌న్ 2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇండియ‌న్ 2 సినిమాకు అవాంత‌రాలు ఏర్ప‌డుతూ వ‌చ్చాయి. అందుక‌నే సినిమాను శంక‌ర్ కొన్నిరోజుల పాటు ఆపేశాడు. ఇప్పుడు మ‌ళ్లీ పునః ప్రారంభిస్తార‌ట‌.

  Published by:Anil
  First published:

  Tags: Ram Charan, Shankar, Yash

  ఉత్తమ కథలు